చిరు జగదేకవీరుడు అతిలోకసుందరితో పోటీపడి అడ్డంగా బోల్తా పడిన సినిమాలు ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను ప్రేక్షకులకి అందించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు చిరు. ఇక చిరంజీవి మరియు శ్రీదేవి జంటగా నటించిన ” జగదేకవీరుడు అతిలోకసుందరి ” సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకి ముందే మెగాస్టార్ చిరంజీవి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇక ఈ సినిమాకు ముందు మూడు సినిమాలతో వచ్చిన ఫేమ్ ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాకి వచ్చిన మరొక ఎత్తు. ఈ సినిమాలో పై లోకం నుంచి దిగొచ్చిన ఇంద్ర కుమారిగా శ్రీదేవి నటిస్తూ.. ఆమెను బంధించడానికి విలన్ గా అమ్రిత్ పూరి నటించారు. ఇక అప్పట్లో ఈ సినిమాకి పోటీగా నిలబడిన సినిమాలు దారుణంగా బోల్తా పడ్డాయనే చెప్పాలి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. ఆయుధం:


కృష్ణ హీరోగా నటించిన ఆయుధం సినిమా జగదేకవీరుడు సినిమాతో పోటీపడి దారుణంగా ఓడిపోయింది.

2. నారి నారి నడుమ మురారి:


నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటించిన ఈ సినిమా కూడా పక్క ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చేటువంటి మూవీ. కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో పోటీ పడడంతో అంతగా నెట్టుకెళ్ళ లేకపోయింది.

3. మామ అల్లుడు:


జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రిలీజ్ కి 9 రోజుల ముందుగా రాజేంద్రప్రసాద్ మామ అల్లుడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో దాసరి సైతం నటించారు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మీడియం కలెక్షన్స్ రాబట్టింది.

ఇక ఈ మూడు సినిమాలే కాకుండా అనేక సినిమాలు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో పోటీపడి దారుణంగా బోల్తా పడ్డాయి.