పుష్పాకి బాగా కలిసొచ్చిన ప్రభాస్ ఎఫెక్ట్.. ఏకంగా ఎన్ని కోట్లు వచ్చాయంటే.. ?

ప్రభాస్ ఎఫెక్ట్‌తో అల్లు అర్జున్ పుష్ప సినిమా రేంజ్ మారిపోయింది. ప్ర‌భాస్ మూవీ హిట్ అవడం ఏంటి అల్లు అర్జున్ పుష్పా 2 సినిమా ల‌క్క్‌ మారడం ఏంటి అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో బటర్ఫ్లై ఎఫెక్ట్ బాగా నడుస్తుంది. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో చెప్పిన డైలాగ్ లాగా ఎక్కడో జరిగిన ఒక సంఘటన మరెక్కడ జరిగిన సంఘటనకు లింకై ఉంటుంది. టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయిందంటే.. కచ్చితంగా అదే రేంజ్ లో వచ్చి తర్వాత సినిమాలకు బిజినెస్ అంతకంటే ఎక్కువ రేంజ్ లో జరుగుతుంది. అదే రేంజ్ లో ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటున్నాయి.

Salar teaser : అనుకున్నంతగా ఏం లేదు.. అంటూ తేల్చేసిన నెటిజన్లు | Netizens  concluded that Salaar teaser is not as expected

ఉదాహరణకు బాహుబలి మూవీ ముందు వరకు కూడా ఏ సినిమా నైనా ఎంత భారీ బడ్జెట్ సినిమాఐనా రూ.50 కోట్లకు మించి బిజినెస్ చేసే వాళ్ళు కాదు. అయితే ఈ సినిమా తర్వాత అంచనాలు మారాయి. తర్వాత రూ.100 కోట్లకు ఇప్పుడు రూ.150 కోట్లకు బిజినెస్ జరుగుతుంది. అందులోనూ నైజాం మార్కెట్ లెక్కకు మించి కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఇక సలార్‌ బిజినెస్ డీల్ అప్పుడు మైత్రి మేకర్స్ రూ.60 కోట్లు పెట్టి హక్కులు కొనడంతో అంతా ఈ బ్యానర్ కు అసలు బిజినెస్ ఏ రాదు అంటూ నిందలు వేశారు. అయితే కేవలం 9 రోజుల్లోనే రూ.70 కోట్ల గ్రాస్లు కొల్లగొట్టి ఆ బ్యానర్ ఎప్పుడు లెక్క తప్పలేదు అంటూ చూపించారు.

Allu Arjun and Rashmika Mandanna's 'Pushpa 2-The Rule' release date  revealed | Telugu Movie News - Times of India

కేవలం తొమ్మిది రోజుల్లో రూ.10 కోట్ల లాభాలను గడించారు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా ఈ బ్యానర్ చేతిలో ఉంది. పైగా ఇది వారి సొంత సినిమా. అంతేకాకుండా పుష్ప సినిమా కు నైజంలో రూ.40 కోట్ల గ్రాస్ రావడంతో సీక్వెల్‌కు ఏకంగా రూ.70 కోట్లు బిజినెస్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. సలార్ ఫలితం చూడకముందు వరకు అసలు అది సాధ్యమైనా అని అందరిలో సందేహం ఉండేది. అయితే సలార్ రిజల్ట్ చూసిన తర్వాత కచ్చితంగా అల్లు అర్జున్ కు నైజాంలో కూడా భారీ మార్కెట్ ఉంటుందని అర్థమైపోయింది. దీంతో ఇప్పుడు పుష్పా సీక్వెల్‌ బిజినెస్ వేరే లెవెల్ లో జరుగుతుందట.