యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తాజాగా తెరకెక్కిన మూవీ ” హనుమాన్ “. సంక్రాంతి పండుగ కానుకగా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మూవీ. ఇక గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ను మించి భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఎంతోమంది ప్రేక్షకులు సినీ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ వర్మ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అదేవిధంగా మరికొందరు ఆయనను పర్సనల్గా ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు. ఇలా ఆయన పనితీరుకు ప్రశంసలు వస్తున్నటువంటి తరుణంలో ఈయన మాత్రం సోషల్ మీడియా వేదికగా అందరికీ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు.
ప్రశాంత్ వర్మ తనకు మూడు రోజుల నుంచి బాగా జ్వరంగా ఉందని.. అందుకే అందరి మెసేజెస్ తాను ఎత్తడం లేదని.. ఒక్కసారి తనకు ఆరోగ్యం బాగా అయ్యాక అందరికీ జవాబులు ఇస్తానని తెలియజేశారు. ఈ క్రమంలోనే అందరికీ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.