హనుమాన్ సీక్వెల్ లో ఆ స్టార్ హీరోనే ఆ స్పెష‌ల్ రోల్ కి పర్ఫెక్ట్ అంటూ..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజసజ్జ హీరోగా తెర‌కెక్కిన హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సినిమా తెలుగులో మొట్టమొదటి సూపర్ మ్యాన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాకు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులే కాక కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రిల‌లోను భ్రమరాథం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్.. తేజ యాక్టింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దీంతో థియేటర్స్ అంత జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతుంది.

Hanu-Man (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

మనిషికి సంకల్పం ఉంటే విశ్వంలో అన్ని శక్తులను ఏకం చేసి విజయ తీరాలకు చేరుస్తారు అనడానికి ఈ సినిమా నిదర్శనంగా నిలిచింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మోతమోగిపోతుంది. ఇక సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ఉండబోతుందంటూ చివరలో ప్రకటించారు, దీంతో ఈ సినిమాపై భారీగా హైప్ పెరిగిపోయింది. ఈ షాట్ లో హనుమాన్ శ్రీరాముడికి ఓ మాట ఇచ్చినట్లు చూపించారు. ఆ మాట ఏంటి.. ఇంతకీ రాబోయే సీక్వెల్లో హనుమాన్ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుంది.. అనే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చినీయింశంగా మారింది.

Megastar Chiranjeevi Biography: Movies, Photos, Videos, News, Biography &  Birthday

దీనిపై చాలామంది నెట్టిజ‌న్స్ స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి అయితేనే ఈ పాత్రకు సరైన ఎంపిక అని చిరంజీవి నటిస్తే ఖచ్చితంగా బాగా సెట్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్వయంగా ఆంజనేయ స్వామి భక్తుడు అని చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్స్ లో చెప్పిన సంగతి తెలిసిందే. పాత్రలో మెగాస్టార్ని చూడడం ప్రేక్షకులకు మరింత సంతోషాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక హనుమంతుడు క్యారెక్టర్ లో చిరంజీవి అంత ఇంపాక్టె కనిపించే హీరో మరి ఎవరు ఉండరని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరంజీవి, ప్రశాంత్ వర్మ మెగా ఫ్యాన్స్ కోరికను తీరుస్తారో లేదో వేచి చూడాలి.