టాలీవుడ్ సినిమాకు మరో కొత్త సెంటిమెంట్.. ఆమె నటిస్తే మూవీ పక్క హిట్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరలక్ష్మి శరత్ కుమార్ అడుగు పెట్టి ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లక్కీ బ్యూటీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్‌లు తెగ వైర‌ల్‌ అవుతున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన మూవీ సంక్రాంతికి కనుక రిలీజ్ అయితే కచ్చితంగా బొమ్మ బ్లాక్ బ‌స్టర్ హిట్ అవుతుందంటూ కామెంట్‌లు వినిపిస్తున్నాయి. క్రాక్, వీర సింహారెడ్డి, హనుమాన్ సినిమాలతో ఈ సెంటిమెంట్ నిజమైంది.

Varalaxmi Sarathkumar turns baddie for Veera Simha Reddy- Cinema express

వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అన్ని సినిమాలు సక్సెస్ సాధించకపోయినా.. సంక్రాంతి సినిమాలు మాత్రం ప్రేక్షకుల అంచనాలను మించి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాల కలెక్షన్స్ విషయంలో కూడా కనక వర్షం కురిపించాయి. వరలక్ష్మి శరత్ కుమార్ ఉంచుకునే పాత్రలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ తన సత్తా చాటుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమా పెద్దదైన, చిన్నదైనా కంటెంట్ ఉన్న పాత్రలోనే నటిస్తూ మెప్పిస్తుంది.

HanuMan' has me as a loving sister: Varalaxmi Sarathkumar

దీంతో ఈమెకు మరింత ప్లస్ అవుతుంది. కాగా ఈమె రెమ్యూనరేషన్ కూడా లిమిట్ లో తీసుకుంటుందట. తాజాగా వచ్చిన హనుమాన్ బ్లాక్ బస్టర్ తో వరలక్ష్మికి మరిన్ని అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హనుమాన్ మూవీలో హీరో అక్క పాత్రలో కనిపించిన వరలక్ష్మి. ఆ పాత్రలో ఎమోషన్స్ ను అద్భుతంగా పండించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఎప్పటికప్పుడు వరలక్ష్మి ఫ్యాన్ ఫాలోయింగ్ రేట్ మరింతగా పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఆఫర్లు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. ఇక ఫ్యూచర్లో వరలక్ష్మి మరిన్ని వరుస సక్సెస్ లు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.