నాకు అవంటే చాలా భయం.. సమంత కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ వరుస‌ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ అగ్ర హీరోల అంద‌రి సరసన నటించిన సమంత.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటిస్‌తో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈమె.. తాజాగా ఓ పోస్ట్ ని షేర్ చేసుకుంది. నాకు ఇవంటే చాలా భయం అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ సమంతకు ఏమంటే అంత భయం.. ఎందుకు అంత భయపడుతుంది అనే అంశాన్ని ఒకసారి చూద్దాం. సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది.

ఇంతలోనే కొత్త విషయం బయటకు చెప్పింది. తనకు పువ్వులు అంటే ఎలర్జీ అని.. వాటిని అందుకోవడం అంటే భయమేస్తుందని వివరించింది. తను instagram హ్యాండిల్ లో పూల గుత్తిని తీసుకుంటూ సంతోషకరమైన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. ఆ ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంటూ తనకు ఉన్న సమస్య గురించి వివరించింది. పువ్వుల వల్ల తను అత్యవసర గదిలో చికిత్స పొందడానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని క్యాప్షన్ ఇచ్చింది. మీరు ఈ అందమైన వస్తువులను ఇష్టపడినప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ కలిగి ఉంటారు కానీ గతం నన్న భయపెడుతుంది.. ఎందుకంటే చివరిసారి మీరు నన్ను ఐసీయూలోకి పంపారంటూ పువుల‌ను గురించి వివ‌రించింది.

Samantha Ruth Prabhu calls herself 'older and wiser' as she shares smiling  photo days after birthday, fans shower love - News Azi

పువ్వులతో నరకం ఎవరికి ఇష్టం అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చింది. ఇక ప్రస్తుతం నటనకు విరామం ఇచ్చి మయోసైటిస్ ఆటో యూనియన్ కండిషన్ కి చికిత్స పొందుతోంది. ఇక తాజాగా మయో సైటీస్ నుంచి కోల్కొన సమంత ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో నా హావాభావాలు నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఎన్నో ట్రోల్స్ కు గురయ్యారని ఒక ప్రత్యేకమైన ట్రోల్స్ బ్యాచ్కు లక్ష్యంగా మారారని అయినప్పటికీ నేను నాలా ఉండడం చాలా స్వీట్నెస్ అంటూ వివరించింది. ఇక రెట్టింపు ఉత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టేందుకు.. త‌న‌ తదుపరి భారీ ప్రాజెక్టులతో అలరించేందుకు స‌మంత సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.