” చిరు 156 “మూవీపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న డైరెక్టర్.. ఏం పీకడానికి అంటున్న ఫ్యాన్స్..!

స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిరు హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరు కెరీర్ 156వ సినిమా పై అందరిలోనూ మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక చాలాకాలం తర్వాత మెగాస్టార్ నుంచి ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా ఇది వస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాపై అయితే ఇప్పుడు క్రేజీ అప్డేట్ ని కూడా మేకర్స్ అందించారు. అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ మొదటి నుంచి కూడా ఓ రేంజ్ లో హైప్స్ ని రేపుతున్నట్లుగా లేటెస్ట్గా ఈ యంగ్ దర్శకుడు చేసిన కామెంట్స్ మెగా ఫాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.

తాను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఈ సినిమా మెగాస్టార్ గారి కెరీర్లో ఒక టాప్ టెన్ చిత్రాలు ఉంటే వాటిలో టాప్ 3 లో ఒకటిగా నిలుస్తుంది. ఇక చిరంజీవి గారి కెరీర్ లో ఒక జగదీక వీరుడు అతిలోకసుందరి సినిమా తరువాత ఎలా మాట్లాడుకున్నారో ఈ సినిమా తర్వాత కూడా అలానే మాట్లాడుకుంటారు.. ” అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పాడు డైరెక్టర్. ఇక ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.