పెళ్లి మేటర్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఏం చెప్పిందంటే..?

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ బ్యూటీగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ బిజీబిజీగా గ‌డుపుతుంది. నటనతో తన సత్తా చాటిన ఈమె క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే సినిమాలో నటిస్తుంది. సినిమా చిన్నదైనా, పెద్దదైన కంటెంట్‌తో ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ విధంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి నటిస్తుందంటే ఆ సినిమాలో కచ్చితంగా ఏదో కంటెంట్ ఉండే ఉంటుంది అనేంతగా ప్రేక్షకుల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

క్రాక్, నాంది లాంటి సినిమాల్లో తనేంటో ప్రూవ్ చేసుకుంది. యశోదతో వైవిధ్యమైన క్యారెక్టర్ లో కనిపించింది. వేరే సింహారెడ్డిలో విశ్వరూపం చూపించి బాలయ్య యాక్టింగ్ ని డామినేట్ చేసేంతగా రెచ్చిపోయింది. ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ గా పాన్ ఇండియా సక్సెస్ సాధించిన హనుమాన్ లోనూ తేజ అక్కగా తనదైన నటనతో మెప్పించింది. ఇక ఈమె పెళ్లి విషయంలో మాత్రం ఎప్పుడూ సరిగ్గా సమాధానం ఇవ్వదు. అయితే తాజాగా పెళ్లి పై స్పందించిన వరలక్ష్మి మాట్లాడుతూ పెళ్లి టైం వచ్చినప్పుడు జరుగుతుందని.. దాని ప్లాన్ చేయమని వివరించింది. మ్యారేజ్ అనేది లైఫ్ లో ఒక భాగం మాత్రమే.. అది జీవితం కాదు.. అదే లక్ష్యం కూడా కాదు.. అంటూ వివరించింది.

త‌న పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడటం మానేసి 18 ఏళ్ల అయిందని.. తన దృష్టిలో మ్యారేజ్ ముఖ్యం కాదని.. పెళ్లి చేసుకున్న చేసుకోకపోయినా నాకు ఓకే అంటూ వివరించింది. ఇప్పటికీ చాలామంది స్టార్ హీరోయిన్స్ గా ఉన్నవారు పెళ్లి చేసుకోకుండానే ఉన్నారని.. అందుకు త్రిష ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చింది. ఇలా పెళ్లి పై తన ఒపీనియన్ షేర్ చేసుకున్న వరలక్ష్మి.. తను మ్యారేజ్ కు వ్యతిరేకం కాదని కానీ పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని వివరించి.. ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచనలు లేనట్లు చెప్పుకొచ్చింది. దానికి ఇంకా టైం ఉందని వివరించింది.