” విజయ్ సేతుపతి ఎవరో నాకు తెలియక సెర్చ్ చేశా “.. కత్రినా సంచలన వ్యాఖ్యలు..!

విజయ్ దళపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మూవీ ” మేరీ క్రిస్మస్ “. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మేరి క్రిస్మస్ సినిమా చూసిన వారంతా ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మొత్తానికి సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా కైఫ్ షాపింగ్ కామెంట్స్ చేసింది.

కత్రినా మాట్లాడుతూ..” నేను 96వ సినిమా చేశాను. అందులో త్రిష, విజయ్ ఇద్దరు చాలా ఇష్టం. దర్శకుడు శ్రీరామ్ నేను నటించబోయే సినిమాలో విజయ్ సేతుపతి హీరో అని చెప్పాడు. అతడు ఎవరనేది నాకు తెలియక.. అతనెవరో తెలియడానికి గూగుల్లో సెర్చ్ చేశాను.

అందులో మొదట నేను చూసినప్పుడు విజయ్.. గడ్డం, తెల్ల జుట్టుతో కనిపించాడు. నాకు అతని స్టైల్ నచ్చింది. అప్పుడు తెల్ల గడ్డం ఏ సినిమా కోసం అని విజయ్ ని అడిగాను. దానికి ఆయన నా ఒరిజినల్ లుక్ అని సమాధానం ఇచ్చారు ” అంటూ చెప్పుకొచ్చింది కత్రినా. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.