” గుంటూరు కారం ” తో సూపర్ రికార్డ్ ని క్రియేట్ చేసిన మహేష్.. ఇక ఒక్కొక్కడికి ఊచకోతేగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటించిన మూవీ ” గుంటూరు కారం “. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే సంక్రాంతి పండగ కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల తో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకోవడంతో సూపర్ స్టార్ అభిమానులు కృంగిపోయారు.

ఇక సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఓ సూపర్ స్టార్ సినిమా అంటే మినిమం కలెక్షన్స్ రాబడతాయి. ఇక ఈ తరుణంలోనే మహేష్ సినిమా కూడా సూపర్ డూపర్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా నలుగురు రూ. 100 కోట్ల షేర్ మూవీస్ కలిగిన మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం కూడా రూ. 100 కోట్ల షేర్ అందుకోవడం గమనార్హం.

ఇక మొత్తంగా వరుసగా అయిదు వందల కోట్ల షేర్తో రికార్డ్ సొంతం చేసుకున్నాడు మహేష్. ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ పై నిర్మించిన ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తున్నాడు.