23 ఏళ్ల అనంతరం మొట్టమొదటిసారి వెంకీకి అలాంటి చేదు అనుభవం..!

సంక్రాంతి పండగ నేపథ్యంలో రిలీజ్ అయిన సినిమాల్లో వెంకటేష్ హీరోగా నటించిన ” సైంధవ్ ” మూవీ ఒక‌టి. ఈనెల 13న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. ఇక వెంకీకి తన ప్రేక్షకులను ఎలా మెప్పించాలో బాగా తెలుసు. 2001 సంక్రాంతికి వెంకటేష్ నటించిన ” దేవిపుత్రుడు ” మూవీ రిలీజ్ అయింది.

అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఎందుకంటే అది సంక్రాంతి పండక్కి తగ్గ సినిమా కాదు. ఇక ఈ సినిమా దెబ్బకి నిర్మాత రాజు చాలా నష్టపోయారు. ఇక దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన ఈ సినిమా బాగోదు అని కాదు. దాని సబ్జెక్ట్ చాలా మంచిది. కాకపోతే అది పండగ సినిమా కాదు. 2000లో వెంకటేష్ హీరోగా వచ్చిన ” కలిసుందాం రా ” ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.

 

ఎందుకంటే అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ సంక్రాంతి సీజన్ కి తగ్గట్టు ఉన్నాయి. కానీ మళ్లీ 23 ఏళ్ల తర్వాత అంటే 2024లో వెంకటేష్ ” దేవీపుత్రుడు ” సినిమాకి చేసిన తప్పే చేశారు. ఈ సంక్రాంతికి ” సైంధవ్ ” ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు. పోనీ ఈ సినిమాకి టాక్ ఏమైనా బాగుందా అంటే అది లేదు. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టించినప్పటికీ పెద్దగా సక్సెస్ మాత్రం అవ్వలేదు. ఇక 23 ఏళ్ల తర్వాత కూడా వెంకీ ఈ తప్పు చేయడంతో తన అభిమానులు కృంగిపోతున్నారు.