” ఎప్పటికీ బాలయ్య నాకు అలానే ” .. కత్రినా కైఫ్ సెన్సేషనల్ కామెంట్స్..!

హీరోయిన్ కత్రినా కైఫ్ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ బాలయ్య పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈమె మాట్లాడుతూ..” ఈరోజు ఇంత బాగా డాన్స్ చేస్తున్నానంటే దానికి కారణం బాలయ్య చెప్పిన కొన్ని మెలకువలే కారణం. అల్లరి పిడుగు సినిమాలో కచ్చితంగా డాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ హీరో దగ్గరుండి మరి డాన్స్ ఎలా చేయాలో నేర్పించారు. డాన్స్ క్రెడిట్ మాత్రం బాలయ్యకే.

నా డాన్స్ విషయంలో మాత్రం ఎప్పటికీ నా గురువు బాలయ్యనే ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా బాలయ్య ” అఖండ 2, కెరీర్ 109వ ” లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుస విజయాలను అందుకుంటున్న బాలయ్య బాబు ఈసారి ఎటువంటి రికార్డు క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.