మెగాస్టార్ ‘ విశ్వంభరా ‘ లో కోలీవుడ్ క్రేజీ హీరో.. ఏ పాత్రలో అంటే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను ముల్లోకాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తమిళ్ హీరో శింబు ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. పైగా ఈ సినిమాలో శింబు నెగిటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడట. ఈ రోల్ ను డైరెక్టర్ వశిష్ట ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. మొత్తానికి రోజు రోజుకు విశ్వంభర పై అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు మేకర్స్. ఇందుకు తగ్గట్టుగానే సినిమా కథ కూడా ఉండబోతుందట.

ఇక తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వశిష్ట మీడియాతో షేర్ చేసుకున్నాడు. ఈ మూవీలో మెగాస్టార్‌ను అంతా ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అచ్చం అలాగే ఉంటుంది. దానితోపాటు అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉండబోతుంది అంటూ వివరించాడు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.