ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ చేసుకునే అప్డేట్.. ‘ కల్కి 2898 AD ‘ రిలీజ్ ఆ స్పెషల్ రోజునే..

స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా సలార్‌ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగానే ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త. ఇక కల్కి 2898 సినిమాను వైజయంతి మూవీస్ కు బాగా కలిసి వచ్చిన మే 9 వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు.. ట్రాక్ టాలీవుడ్ తన రిపోర్ట్ లో వివరించింది.

Kalki 2898 AD Glimpse | Prabhas | Amitabh Bachchan | Kamal Haasan | Deepika  Padukone | Nag Ashwin - YouTube

మూడేళ్లుగా కల్కి 2898ఏడి మూవీ షూటింగ్ కొనసాగుతుంది. చాలా రోజులపాటు ప్రాజెక్టు కే.. గా పిలిచిన ఈ మూవీకి గత ఏడాది టైటిల్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ అవుతుందని అంతా భావించారు. కానీ గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో అది జ‌ర‌గ‌లేదు. ఇక ఎప్పటినుంచో ఈ బ్యానర్ కు కలిసి వస్తున్న మే 9న ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ నిర్మాణ సంస్థకు మే 9వ తేదీ గతంలో బాగా కలిసి వచ్చింది. ఈ బ్యానర్ లో రిలీజ్ అయిన సినిమాలు అన్ని బ్లాక్ బ‌స్టర్ హిటై భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.

గత 34 ఏళ్ల కిందట 1990 మే 9న రిలీజ్ అయిన చిరంజీవి జగదీక వీరుడు అతిలోకసుందరి సినిమా చిరు కెరీర్‌లోనే మెగా హిట్గా నిలిచిపోయింది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే రూ.15 కోట్ల గ్రాస్ వ‌శుళ‌ను కొల్లగొట్టి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇక చాలా రోజుల తర్వాత వైజయంతి మూవీస్‌కు మరో హిట్ ఇచ్చిన మహానటి మూవీ కూడా మే 9నే రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా ఇండస్ట్రియల్ హిట్గా నిలిచి భారీ కలెక్షన్లను తెచ్చి పెట్టింది.

Prabhas, Deepika Padukone Film 'Kalki 2898 AD' Unveiled at Comic-Con

ఇక ప్రస్తుతం సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రిస్క్ చేసి తీస్తున్న కల్కి 2898ఏడి సినిమాని కూడా అదే రోజున రిలీజ్ చేస్తే తమ పంట పండుతుందని వైజయంతి మూవీస్ భావిస్తున్నట్లు.. సదరు రిపోర్టులో వెల్లడించారు. అయితే అది సాధ్యమైన అన్నది సందేహమే. ఈ మూవీ గ్రాఫిక్స్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మరో 90 రోజులు కలిపి 2898 ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఈ మధ్యనే బొంబే ఐఐటీలో డైరెక్టర్ నాగ అశ్విన్‌ వివరించాడు. ఆ లెక్కన ఏప్రిల్‌లో ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది. దీంతో సాధ్యమైనంత త్వరగా గ్రాఫిక్స్ పూర్తి చేసి అదే రోజున సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.