మాటకు ముందు పుసుక్కుమని వెకేషన్లకు వెళ్ళేది అందుకా..? మహేష్ బాబు మాస్ ఆన్సర్ కి నోర్లు మూయాల్సిందే ..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ వెకేషన్ లకి వెళ్తూ ఫ్యామిలీతో టైం ఎక్కువగా స్పెండ్ చేసే హీరో ఎవరు అంటే మాత్రం కళ్ళు మూసుకొని నిద్రలో లేపి అడిగినా చెప్పే పేరు మహేష్ బాబు . ఇది అందరికీ తెలిసిందే పలువురు పొలిటీషియన్లు ..స్టార్ హీరోలు అందరూ కూడా మహేష్ బాబు పై సరదాగా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ” ఈ హీరో తన భార్యతో పిల్లలతో వెకేషన్ లోకి వెళ్తూ ఉంటాడు అని.. అది చూసి మా భార్యలు మమ్మల్ని వెకేషన్ కి తీసుకెళ్లమని సతాయిస్తూ ఉంటారు అని ..

మహేష్ ఎలా టైం మేనేజ్ చేస్తున్నారో మాకు తెలియడం లేదు అని.. పలువురు హీరోలు డైరెక్ట్ గా కూడా చెప్పారు . రీసెంట్గా ఇదే క్వశ్చన్ ఆయనకు ఓ ఇంటర్వ్యూలో ఎదురయింది. దీంతో మహేష్ బాబు ఇచ్చిన ఆన్సర్ కి అక్కడ ఉండే జనాలు షాక్ అయిపోయారు . “అవును నాకు నా ఫ్యామిలీతో టైం గడపడం చాలా ఇష్టం. గంట టైం దొరికినా నా ఫ్యామిలీతోనే స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడు నేను ఇండియాలో నా ఫ్యామిలీతో బయట తిరిగితే నాకు ప్రైవసీ ఉండదు”.

“ఖచ్చితంగా సెక్యూరిటీ కష్టం .. నావల్ల నలుగురు ఇబ్బంది పడాలి. అదే నేను ఫారిన్ టూర్ కి వెళ్తే అక్కడ నేనంటే ఎవరో పెద్దగా తెలియదు. అప్పుడు నా ఫ్యామిలీతో నేను క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు . అందుకే నేను బయటకు వెళ్లడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను”.. అంటూ మహేష్ బాబు తనదైన స్టైల్ లో మాస్ ఆన్సర్ ఇచ్చి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు . ఇకపై మహేష్ బాబు చెప్పిన ఆన్సర్ విని ఎవరు కూడా ఆయన్ని ఈయనను వెకేషన్ కి వెళ్తున్నారు అని ట్రోల్ చేయకూడదు అంటున్నారు మహేష్ బాబు అభిమానులు..!!