యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రోల్స్.. కారణం ఇదే..

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న‌ రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారిందని తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ కు హాజరు కాలేని పరిస్థితుల్లో.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సకాలంలో పూర్తి కాకపోవడం.. మరిన్ని కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు నేపథ్యంలో ఈ సినిమా అంతకంతకు ఆలస్యం కానుంది అని సమాచారం.

Devara Postponed? Saif Ali Khan's Injury and Andhra Pradesh Elections  Possible Reasons | Report

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రిటిక్స్ మాత్రం బాలీవుడ్ లో ఏప్రిల్ 10వ తేదీన పలు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దేవరా వాయిదా వేసినట్లు పలు కామెంట్లు చేస్తూ ట్రోల్స్‌ చేస్తున్నారు. అయితే సౌత్ సినిమాలు పై బాలీవుడ్ మేకర్స్‌, క్రిటిక్స్ విషయం కక్కడం ఎప్పటినుంచ జరుగుతూనే ఉంది. సలార్‌,ఢంకీ రిలీజ్ అయిన టైంలో అయితే సలార్ గురించి బాలీవుడ్ మీడియాలో నెగిటివ్ కథనాలు కొప్పలుతెప్పలుగా వచ్చాయి. దేవర సినిమాకు హిందీ మార్కెట్ ముఖ్యం. కానీ హిందీ కంటే తెలుగు మార్కెట్ చాలా ముఖ్యం.

See poster: Jr NTR's 'Devara' team gifts Saif Ali Khan's first look on his  birthday - India Today

ఇక దేవర మూవీ థియేటర్స్‌కు ఎప్పుడు రిలీజ్ అవుతుందొ మేకర్స్ క్లారిటి ఇస్తేకాని తెలియదు. రూ.300 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ లేట్ అయితే వడ్డీలు భారీగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్‌ భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమా ఆడియో రైట్స్ ఏకంగా రూ.33 కోట్ల కు అమ్ముడుపోయాయి. ఇది నిజంగానే రికార్డు అని చెప్పాలి. ఇక బాలీవుడ్ మీడియా సౌత్‌ సినిమాలను అనవసరంగా, అన్యాయంగా టార్గెట్ చేస్తూన్నాయి. తాజాగా ఎన్టీఆర్‌ను కూడా అలానే ట్రోల్స్ చేస్తున్నారు అంటూ టాలీవుడ్ వర్గాల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.