‘ టైటానిక్ ‘ సినిమా తర్వాత మళ్లీ అలాంటి రికార్డ్ కేవలం మోహన్ బాబు నటించిన ఆ సినిమాకి మాత్రమే ఉందని తెలుసా..?

సినిమాల పరంగా ప్రపంచంలో కెల్లా అద్భుతమైన లవ్ స్టోరీ ఏదైనా ఉంది అంటే టక్కున అందరికీ గుర్తుకు వచ్చింది టైటానిక్. జేమ్స్ కామెరున్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచంలో అన్ని చోట్ల అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. మన ఇండియాలోనే తెలుగులో అనేక సెంటర్లో 100రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1997లో రిలీజైన‌ ఈ సినిమా ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన చూడ చక్కని లవ్ స్టోరీ గా.. ప్రపంచ సినిమాను ఏకం చేసే సినిమాగా ఖ్యాతిని పొందింది. ఇక ఈ సినిమా వచ్చిన రెండేళ్ల తర్వాత 1999లో మోహన్ బాబు హీరోగా శ్రీరాములయ్య సినిమా తెరకెక్కింది.

మోహన్ బాబు, హరికృష్ణ 'శ్రీరాములయ్య'@22 ఇయర్స్.. ఎన్నో వివాదాలు.. – News18  తెలుగు

ఎన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ నేమ్ మోహన్ బాబు పోషించారు. మోహన్ బాబు భార్యగా సౌందర్య, ఓ కీలక పాత్రలో నందమూరి హరికృష్ణ నటించి మెప్పించారు. అయితే అసలు విషయం ఏంటంటే టైటానిక్ ఉన్న ఓ రికార్డ్ తెలుగులో కేవలం మోహన్ బాబు నటించిన శ్రీరాములయ్య సినిమాకు మాత్రమే సొంతమయ్యింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. టైటానిక్ సినిమాలో ప్రతి షార్ట్ ఎంతో అద్భుతంగా తర్కెక్కించాడు కామెరూన్. ఇక పడవ మునుగుతున్న సన్నివేశం అయితే ప్రతిక్షణం ప్రేక్షకులను ఉత్కంఠ కలిగించే విధంగా ఉంటుంది.

Titanic | History, Sinking, Rescue, Survivors, Movies, & Facts | Britannica

షిప్ రెండుగా చీలి పైనుంచి కింది వరకు మునుగుతున్న షార్ట్ అయితే కనురెప్ప వేయకుండా చూడాలనిపించే అంత ఆసక్తి నెలకొల్పుతుంది. ఈ సన్నివేశాలు షూట్ చేసే టైంలో జేమ్స్ కామెరూన్ ఒకేలా క్రేన్ అనే ఒక కొత్త టెక్నాలజీతో కూడిన క్రేన్ ను ఉపయోగించాడు. ఈ సినిమా వచ్చిన రెండేళ్లకే మోహన్ బాబు నటించిన శ్రీరాములయ్య సినిమా వచ్చింది. హెలికాప్టర్ కు సదరు క్రేను కట్టి సినిమా మొదలైన సందర్భంగా శ్రీ‌రాములయ్య సమాధిని చూపించడానికి ఆ క్రేన్ టెక్నాలజీని వాడారు. సినిమా మొదలవుతుండగా వచ్చే ఈ షాట్స్ చూడడానికి చాలా కొత్తగా అనిపిస్తాయి.