మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కూతిరి మృతి.. తీవ్ర విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ..

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట ఇటీవల తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె సింగర్ భవతారాణి క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న(25 జ‌న‌వ‌రి) సాయంత్రం కన్నుమూశారు. క్యాన్సర్ బారిన పడిన ఆమెకు కొంత‌కాలంగా శ్రీలంకలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అక్కడే చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. శ్రీలంక ఆయుర్వేద వైద్యం కోసం వెళ్లగా గురువారం సాయంత్రం భవితరాణి తన చివ‌రి శ్వాస విడిచింది. ఇళయరాజ కూతురి మృతి తో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

Bhavatharini, award-winning singer and daughter of music maestro Ilayaraja,  dies at 47

భవితారాణి మరణం పట్ల చాలామంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈరోజు సాయంత్రం ఆమె భౌతిక కాయం చెన్నైకి రానున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఆమె అంత్యక్రియలు నిర్వహించబోతున్నారట. తండ్రి ఇళ‌య‌రాజా రాజ సంగీతం అందించిన రాజయ్య చిత్రంలో ఆమె గాయనిగా ఎంట్రీ ఇచ్చింది. భ‌వితారాణి దాదాపు 30 సినిమాల్లో ఎన్నో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకుంది.

Bhavatharini, daughter of musician Ilayaraja, no more - The Hindu

భారతీ.. లోని మైల్ పోలా పొన్ను ఒన్ను అనే తమిళ్ పాటకు ఉత్తమ నేపథ్యగాయనిగా నేషనల్ అవార్డును అందుకుంది. కాగా అతి చిన్న వయసులోనే ఈమె మరణించడంతో ఇళ‌య‌రాజా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు. కార్తీక్ రాజా, యువ‌న్‌ శంకర్ రాజు వీరిలో యువన్‌శంకర్ రాజు మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు. భవితరాణి ఎక్కువగా తండ్రి, సోదరుల దర్శకత్వంలో పాటలు పాడింది. ఇళయరాజా కూతురు మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.