ఆరోగ్యానికి మంచిదని నువ్వుల నూనె డైలీ వాడుతున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..

ప్రస్తుతం మనం రోజువారీ ఆహారంలో ఎన్నో రకాల నూనెలను వాడుతూ ఉంటాం. అందులో నువ్వుల నూనె కూడా ఒకటి. ఆరోగ్యానికి మేలు చేస్తుందనే కారణంతో చాలామంది నువ్వుల నూనె ఏడాది పొడవునా వాడుతూనే ఉంటారు. అయితే ఇలా డైలీ ఆహారంలో నువ్వలా నూనెలు వాడే వారి కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. నువ్వుల నూనెను శతాబ్దాలుగా ఎంతో మంది వాడుతున్నారు. చక్కటి రుచిని మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇది కలిగి ఉంటుందన్నమాట వాస్తవమే. ఆరోగ్యపరంగా నువ్వుల నూనె కొట్టేది మరొకటి ఉండదు. అయితే ఏడాది పొడవున నువ్వుల నూనె వాడటం మాత్రం కరెక్ట్ కాదు అని నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో వంటల్లో వాడేందుకు నువ్వుల నూనె ఎంతో మంచి ఎంపిక అని.. అలాగే వర్షాకాలంలో కూడా పరిమితికి తగ్గట్లుగా నువ్వుల నూనెను ఆహారంతో వాడవచ్చని కానీ వేసవిలో మాత్రం నువ్వుల నూనె వాడడం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని వెచ్చగా ఉంచే గుణం నువ్వుల నూనెలో ఉంటుంది. దీని కారణంగా వేసవిలో కూడా నువ్వుల నూనె వాడితే బాడీ మరింత వేడుకణాలతో హీటెక్కి పలు సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి చలికాలం మరియు వర్షాకాలంలో మాత్రమే నువ్వుల నూనెను ఆహారంలో తీసుకోవాలి. ఇక నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు నిత్యం నువ్వుల నూనెను తీసుకోవడం మేలు జరుగుతుంది. నువ్వుల నేను కొల‌స్ట్రాల్‌ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహకరిస్తుంది. గుండె సంబంధిత జబ్బులకు చెప్పి పెడుతుంది. నువ్వుల నూనెలో ఉండే టెర్రోసిన్ అనే అమినోయాసిడ్ మెదడుకు అవసరమైన ఎంజాయ్ మరియు హార్మోన్లను సమృద్ధిగా అందిస్తుంది. ఫలితంగా డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను మెయింటైన్ చేయడానికి కూడా నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది. హెవీ బ్లడ్ ప్రెషర్, నిద్రలేమి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.