పిల్లలకు నల్ల ద్రాక్ష తినిపిస్తున్నారా.. అయితే కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

ద్రాక్ష పండ్ల‌ను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందులోనూ నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. కొంతమంది నల్ల ద్రాక్ష చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అసలు వాటిని ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను గురించి తెలుసుకుంటే కచ్చితంగా నల ద్రాక్ష తినడం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నల్ల ద్రాక్షలో విటమిన్ ఏ, విటమిన్ b6, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అయితే నల్ల ద్రాక్షని ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి చూద్దాం.

సాధారణంగా నల్ల ద్రాక్ష‌ను హైబీపీతో బాధపడేవారు ప్రతిరోజు కొద్దిగా మోతాదులో తినడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా ఈ పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది మ‌న శ‌రీరానికి చాలా సహకరిస్తుందట‌. రక్తప్రసరణ ఎక్కువగా జరగడానికి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి నల్ల ద్రాక్ష ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది.

ఇక నల్ల ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. ప్రీరిడికల్స్ భారి నుంచి బాడీని కాపాడతాయి. వీటిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు కొన్ని నల్ల ద్రాక్ష పండ్లను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీ డైట్ లో కూడా వీటిని చేర్చుకోండి. శరీరంలో కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ కూడా లభిస్తాయి. పిల్లలకు కూడా ఈ పండ్లను రోజు తినడం అలవాటు చేస్తే.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.