మహేష్ ” కుర్చీ ” పాటలో మరో క్రేజీ స్టెప్… ఏం క్రియేషన్ రా బాబు…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా .. యంగ్ బ్యూటీ శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల‌ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక జనవరి 12, 2024న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి వాటికి సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఇక తాజాగా రిలీజ్ అయిన ” కుర్చీ ” సాంగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో శ్రీ లీలతో సూపర్ స్టార్ మహేష్ బాబు వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి.

ఇక మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్ లో ఒక క్రేజీ స్టెప్ప్ ను దాచినట్లు తెలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి షేర్ చేశాడు. అదేంటంటే… ఈ పాటలో ఇంకో క్రేజీ స్టెప్ ఉంది. థియేటర్లలో ఫ్యాన్స్ కి ఫీస్ట్ .. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం థమన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.