అల్లు అర్జున్ – బోయపాటి కాంబో ఫిక్స్.. ఆ ఎఫెక్ట్‌తో సైడైన త్రివిక్ర‌మ్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్ష‌న్‌లో గతంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 15న‌ సినిమా రిలీజ్ కానుంది. మొద‌టి భాగం పాన్ ఇండియా లెవెల్ లో మంచి సక్సెస్ సాధించడంతో.. సెకండ్ పార్ట్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత కేర్ తీసుకుంటున్నాడు సుకుమార్. ఇక ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోస్ అంతా రెండు మూడు సినిమాలకు కమిట్ అయిపోయారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోల లైన్ అప్ చాలా గట్టిగా ఉంది.

బ‌న్ని తర్వాత చేయబోయే సినిమా ఏంటి అనే ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ ప్రశ్నకు అఫీషియల్ సమాధానం వచ్చింది. సరైనోడు కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలుస్తుంది. బోయపాటి శీను గత సినిమా స్కంధ‌ ఫ్లాప్ అయినా స్టార్ హీరోలకు బోయపాటి పై నమ్మకం త‌గ్గ‌లేదు. ఎందుకంటే బోయపాటి హీరోలను ప్రజెంట్ చేసే విధానం అలా ఉంటుంది. అయితే సరైనోడు తర్వాత బోయపాటి బన్నీతో మూవీ చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు. ఎట్టకేలకు అల్లు అర్జున్‌తో, అల్లు అరవింద్ తో కూడా బోయపాటి సినిమాకు ఓకే చేయించేశాడు. అల్లు అర్జున్ హీరో అని అనౌన్స్ చేయకపోయినా.. బ‌న్ని – బోయపాటి కాంబోలో గీత ఆర్ట్స్ మూవీ అంటూ ప్రకటించారు.

ఇక‌ పుష్పా సంద‌డి ఆగస్టులో ముగియబోతుంది. ఈ లోగా బోయ‌పాటి, అల్లు అరవింద్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుంటారు. ఆగస్ట్ తర్వాత నుంచి ఈ కాంబోలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక త్రివేక్ర‌మ్ శ్రీనివాస్ వ‌న్నితో సినిమా చేయాల్సింది. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయింది కూడా.. అయితే ఇంతలోనే త్రివిక్రమ్ సైడ్ అయిపోయి.. బోయపాటి బన్నీ లైన్ లోకి వచ్చేసాడు. దీంతో మహేష్ బాబు గుంటూరు కారం ఎఫెక్ట్.. బన్నీ, త్రివిక్రమ్ కాంబోపై పడిందని గుంటూరు కారం కలెక్షన్లు బాగానే వచ్చిన.. ఫ్లాప్ టాక్ రావడంతో త్రివిక్రమ్ ను సైడ్ చేసి బోయపాటితో బన్నీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.