‘ పుష్ప 2 ‘ రిలీజ్ వాయిదా.. మేకర్స్ క్లారిటీ ఇదే..

ఇండ‌స్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో నటించిన పుష్ప సినిమాకు ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పాన్‌ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసింది. ఇక దీంతో ఈ సినిమాకు సీక్వల్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అలాగే గ‌త కొంతకాలంగా సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న నేప‌ధ్యంలో పుష్ప రెండో భాగంపై సుకుమార్ మరింత కాన్సన్ట్రేషన్ పెంచినట్లు ఎక్కువగా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీ షూటింగ్ కాస్త ఇంకా మిగిలిన ఉందని.. అందుకే సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంటుందని.. ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ముందు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావడం లేదని.. సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యేందుకు ప్రణాళికల సిద్ధం చేస్తున్నార‌ని టాక్‌.

ఈ క్రమంలో అల్లు అర్జున్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. మొదట పుష్ప ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప కూడా వెనక్కు తగ్గి.. మొదటి భాగం రిలీజ్ చేసినట్లే డిసెంబర్‌లో పార్ట్ 2 రిలీజ్ చేయడానికి సినిమాను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై స్పందించిన మేకర్స్.. రూమర్లను కొట్టివేశారు. ముందుగా చెప్పినట్లుగానే ఆగస్టు 15 తేదీనే కచ్చితంగా పుష్ప రిలీజ్ అవుతుందని.. పుష్పగాడి అల్లరి థియేటర్లో సందడి చేయబోతుందని క్లారిటీ ఇచ్చారు.