వాళ్ళ చెత్త రాజ‌కీయానికి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ‘ స‌లార్ ‘ మేక‌ర్స్‌.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే..

ప్రభాస్ స‌లార్‌, షారుఖ్ ఖాన్ ఢంకీ సినిమాలకు మధ్య‌న నార్త్‌లో హోరాహరి పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పోటీ మధ్యన జరిగి ఘర్షణలు హాట్‌ టాపిక్ గా మారాయి. ఎప్పటికప్పుడు ఈ థియేటర్ రాజకీయాలకు సంబంధించిన అప్డేట్స్ బాలీవుడ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంది. సలార్ సినిమాను పక్కనపెట్టి హండ్రెడ్ పర్సెంట్ తమ సినిమా ప్రదర్శించాలని ఢంకీ మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్స్ చేశారు. సింగల్ స్క్రీన్ ఓనర్లు అసోసియేషన్ స్టాండ్ తీసుకుని శుక్రవారం ఢంకీ బుకింగ్లను ఓపెన్ చేయడానికి నిరాకరించారు.

Salaar' makers finally confirm clash with SRK's 'Dunki' on December 22 -  India Today

ఇక సాధారణంగా అయితే నార్త్ లో పివిఆర్, ఐనాక్స్ మార్కెట్ అక్కడ ఫార్మాట్‌ను సింగిల్ స్క్రీన్ యాజమాన్యం అంతా ఫాలో అవుతారు. మొదట్లో పివిఆర్‌, ఐనాక్స్‌ సమానంగా సలార్ ఢంకీ సినిమాలకు స్క్రీన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం జరిగింది. అయితే షారుక్ ఖాన్ జోక్యం చేసుకొని స్వయంగా తానే పివిఆర్, ఐనాక్స్ థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి లాభదాయకమైన డీల్ కుదుర్చుకున్నారని.. బాలీవుడ్ వర్గాల్లో టాక్‌ నడుస్తుంది. దీంతో ఆయా మల్టీప్లెక్స్ లు నిర్వహించే సింగిల్ స్క్రీన్‌ల‌లో సలార్ వద్దని ఢంకీని తీసుకున్నారు.

PVR-INOX MERGER: SHAPE OF THINGS TO COME? | 15 February, 2023 – Film  Information

దీంతో వారికి ఎలాగైనా భారీ షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో దక్షిణాదిలోను పివిఆర్, ఐనాక్స్‌ మల్టీప్లెక్స్ లకు సలార్ సినిమాను విడుదల చేయకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక మార్కెట్ లీడర్ గా ఉన్న పీవీఆర్‌, ఐనాక్స్ చైన్ చెత్త రాజకీయాలు చేయకుండా ఉండాల్సిందని.. అందుకు భిన్నంగా ఓపెన్ గానే ఢంకీ మూవీకి థియేట‌ర్స్ ఇవ్వ‌డంతో సలార్ మేకర్స్ ఇలా బిగ్ షాక్ వాళ్ళకి రిటర్న్ ప్లాన్ చేశారు. దీంతో వాళ్ళ చెత్త రాజకీయానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ తగిలినట్టు అయింది.