“ఆ ఒక్కటి కనిపించకుండా చేస్తే చాలు.. ఆడవాళ్లు సేఫ్”..అనసూయ ట్వీట్ వైరల్..!

అనసూయ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . బడా బడా హీరోయిన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతారో లేదో తెలియదు కానీ అనసూయ మాత్రం సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది . పలుసార్లు పాజిటివ్గా మరికొన్నిసార్లు నెగిటివ్గా సోషల్ మీడియాను షేక్ చేసే అనసూయ రీసెంట్గా చేసిన ట్వీట్ అభిమానులకు ఆశ్చర్యకరంగా అనిపించింది .

సోషల్ మీడియా ద్వారా అనసూయ అమ్మాయిలకు కొత్త సందేశం ఇచ్చింది. అనసూయ ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ” ఇల్లు, దుస్తులు ఇంటి గోడలు తలుపుల తో పాటు ఇంకా విలువైనవి కేవలం స్త్రీని కనిపించకుండా మాత్రమే కాపాడగలవు కానీ ఆమె క్యారెక్టర్ మాత్రమే కవచంలా పనిచేసి ఆమెను రక్షిస్తుంది ” అంటూ రామాయణంలోని ఓ కొటేషన్ షేర్ చేసి ఆడవాళ్లకు అండగా నిలిచింది అనసూయ .

దీంతో ఇది చదివిన అనసూయ అభిమానులు అనసూయ కి ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు . మరికొందరు అనసూయ చేసిన ట్వీట్ చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ఆడవాళ్లకు ఎప్పుడు సపోర్ట్ గా నిలుస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఆమె ప్రజెంట్ పలు సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ల్లో నటిస్తుంది..!!