ఫ్లాప్ హీరోలకు అదృష్ట దేవతగా శృతిహాసన్.. ఏకంగా ఎంతమంది హీరోలకు హిట్ ఇచ్చిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ పోతున్న స్టార్ హీరోయిన్‌ల‌లో శృతిహాసన్ ఒకరు. గ్లామర్ రోల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఫ్లాప్ హీరోల పాలిట లక్కీ బ్యూటీగా మారిపోయింది. చాలామంది స్టార్ హీరోలు ప్లాపుల్లో ఉన్న సమయంలో శృతిహాసన్ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారని అభిప్రాయాన్ని ఆమె ఫ్యాన్స్‌ వ్యక్తం చేశారు. మొదట పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ కు వరుస ఫ్లాప్స్ ఎదురయ్యాయి. అయితే శృతిహాసన్ గబ్బర్ సింగ్‌తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ ముందు కూడా వరుస ఫ్లాపులను ఎదుర్కొన్నాడు.

ఇక శృతిహాసన్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అదేవిధంగా మాస్ మహారాజ్ రవితేజ వరుస ప్లాప్‌లో కూరుకుపోయిన సమయంలో బలుపు సినిమాతో అతడికి భారి హిట్టు పడింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఫార్మ్ లోకి వచ్చిన రవితేజ తర్వాత మరోసారి వరుస అప‌జ‌యాలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో శృతిహాసన్‌తో కలిసి క్రాక్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరితో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు వరస ఫ్లాపులు ఎదుర్కొనే సమయంలో శృతిహాసన్ శ్రీమంతుడు సినిమాతో మహేష్ బాబుకు హిట్ ఇచ్చింది.

ఇక ఇటీవల పన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ వరుస ప్లాపులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు ఊహించని రేంజ్ లో సక్సెస్ రాలేదు. ఆది పురుష్‌, రాధే శ్యామ్‌.. ఇలా వరుస ప్లాపులను ఎదుర్కొంటున్న ప్రభాస్‌కు సలార్‌ సినిమాతో భారీ సక్సెస్ అందింది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక అదే విధంగా చిరు ఈ ఏడాదిలో నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.ఇక చిరంజీవి, శృతిహాసన్ కలిసి నటించిన వాల్తేరు వీర‌య్య‌ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. దీంతో తమ అభిమాన స్టార్ హీరోలకు హిట్ ఇచ్చిన శృతిహాసన్ ను లక్కీ హీరోయిన్ అంటూ అదృష్ట దేవత అంటూ.. నెటిజ‌న్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.