ఊర నాటు మాస్ స్టెప్పులతో ఇరగదీసిన మహేశ్-శ్రీలీల.. “కుర్చీ మడత పెట్టి” ఫుల్ సాంగ్ వచ్చేసిందోచ్(వీడియో)..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా హీరోగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది .

ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ వర్క్ చేస్తున్నారు . ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు సోషల్ మీడియాలో ఎలాంటి హ్యూజ్ ట్రోలింగ్ అందుకున్నాయో మనం చూసాం. తాజాగా నిన్న “కుర్చీ మడతపెట్టి” అని ఓ సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేశారు మేకర్స్ . కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రంలోని పూర్తి పాటను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా సాహితీ- శ్రీకృష్ణ మాస్ గొంతుతో పాడి అదరగొట్టారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా పాటని రిలీజ్ చేశారు . ఈ పాటలో శ్రీ లీల మహేష్ బాబు వేసిన స్టెప్స్ ఊర నాటుగా ఉన్నాయి . ఎలా అంటే దుమ్ము దులిపేస్తున్నాయి . థియేటర్లో ఈ సాంగ్ కి నిజంగా కుర్చీలు విరిగిపోవాల్సిందేమో ..అన్నంత రేంజ్ లో వేసేసారు స్టెప్స్. ఫుల్ సాంగ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..!!