ప్రభాస్.. ‘ ఆది పురుష్ ‘ రోల్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..

పాన్ ఇండియ‌న్‌ హీరో ప్రభాస్ త్వరలోనే సలార్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి.. స‌లార్‌ మూవీ టీం తో కలిసి ఇంటర్వ్యూ ను నిర్వహించారు. ప్రభాస్ ఇదివరకు సినిమాల గురించి కూడా ప్రస్తావని తీసుకువచ్చాడు జక్కన్న. ఈ నేప‌ద్యంలో ప్రభాస్ చివ‌రిగా న‌టించిన‌ అది పురుష్‌ సినిమా గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించిన సంగతి తెలిసిందే. కాగా రాముడు వేషధారణ పై ఎంతోమంది తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఆదిపురుష్ చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది. ఇలా ఈ మూవీలో ప్రభాస్ నటించిన రాముడి రోల్‌పై ఇదివరకే చాలామంది సెలబ్రిటీస్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో జక్కన్న కూడా రాముడి రోల్ గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రభాస్ గురించి మాత్రమే కాకుండా డైరెక్టర్ ఓంరౌత్‌ పట్ల కూడా కామెంట్స్ చేశారు. నార్మల్‌గా రాముడి రోల్ అంటేనే రాజసం ఉట్టిపడేలా వేషధార‌ణా, మేకప్ ఉండాలి. కానీ ప్రభాస్ విషయంలో అలా జరగలేదు. ఈయన లుక్ చూసే చాలామంది మోడ్రన్ రామా అంటూ.. చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే రాజమౌళి కూడా రాముడు పాత్ర గురించి మాట్లాడుతూ.. శ్రీరాముడి పాత్ర గురించి నువ్వు సరైన జాగ్రత్తలు తీసుకోలేదు.. కాస్ట్యూమ్, వేషధారణ కూడా సరిగ్గా ప‌ట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.