రాజమౌళి – మహేష్ ప్రాజెక్టులో ఆ తమిళ్ స్టార్ హీరో..

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శ‌క ధీరుడు రాజమౌళి ఎలాంటి స్థానంలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్‌ను తలెత్తుకునేలా చేసిన రాజమౌళి.. ఆయన తీసిన రెండు సినిమాలతో ఎలాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడా అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు జ‌క్క‌న‌ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమాతో మరోసారి పాన్ ఇండియా తో పాటు.. హాలీవుడ్ లెవెల్ లోను తన సత్తా చాటుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు అడ్వెంచర్లు కూడా చేస్తాడంటూ టాక్.

Viral Pic: Mahesh Babu and Rajamouli in one frame - TeluguBulletin.com

ఇక ఇంతకుముందు రాజమౌళి తీసిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. అలాగే ప్రతి పేమ్ కూడా చాలా కొత్తగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీలో తమిళ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో కూడా జాయిన్ అవ్వబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ అతను ఎవరో కాదు.. తమిళ్ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్. ఈయన కూడా ఈ మూవీలో కీలకపాత్రలో నటించబోతున్నట్లు టాక్. అయితే ఆయన ఈ సినిమాలో పోషించేది విలన్ పాత్రనా.. లేదంటే హీరోకి హెల్ప్ చేసే రోల్ ఆ అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Chiyaan Vikram admitted to hospital in Chennai - India Today

అయితే ఈ సినిమాలో చియాన్ విక్రమ్ మాత్రం ఓ క్యారెక్టర్ లో ఖచ్చితంగా నటిస్తున్నాడట. ఇక సినిమాలో విక్రమ్ కనుక చేసినట్లయితే ఆయన నటనతో విశ్వరూపం చూపిస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రాజమౌళి సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరికి ఓ ప్రత్యేకమైన ఇంపార్టెన్స్‌ ఉంటుంది. వారు కూడా ఆరోల్‌కు తగ్గట్టుగానే తమ నటనతో ఆకట్టుకుంటూ ఉంటారు. అలాగే విక్రమ్ కూడా తన సినిమాల్లో ఇప్పటికే తన అద్భుతమైన నటన కనబరిచాడు.. ఇక రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే మరింత నటనను కనబరిచి ఆకట్టుకుంటాడు అంటూ విక్రమ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.