టాలీవుడ్ లో రియల్ డాక్టర్స్ ఎవరో తెలుసా…!!

చాలామంది సినిమా రంగాన్ని ఇష్టపడి సినిమాల్లోకి వస్తూ ఉంటారు. అనంతరం పెద్ద నటులుగా సైతం అయిపోతున్నారు. అయితే సినిమాల్లోకి వచ్చే నటులలో చాలామంది డాక్టర్లు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

1. రాజశేఖర్:


హీరో రాజశేఖర్ కూడా వైద్య విద్యను చదివారు. ఈయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్య వృత్తిపై ఆశ ఏమి తగ్గలేదు.

2. సౌందర్య:


నటి సౌందర్య సైతం ఎంబిబిఎస్ చదివారు. ఈమెకి నటనపై ఆశక్తి ఉండడంతో.. సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం పెద్ద ఎత్తున సక్సెస్ సాధించారు.

3. సాయి పల్లవి:


హీరోయిన్ సాయి పల్లవి సైతం ఎంబిబిఎస్ పూర్తి చేసింది. విద్య పూర్తి అయ్యాక తమిళ్ దర్శకుడు ప్రేమమ్‌ సినిమాలో నటించమని అడిగారు. అలా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది సాయి పల్లవి.

ఇలా ఒకపక్క తమకు నచ్చిన వృత్తిని ఎంచుకుంటూ… మరోపక్క తమ చదువుని పూర్తిచేసి… రెండు రంగాల్లోనూ కొనసాగుతున్నారు. వీరందరూ కూడా సినిమా రంగంలో బాగానే స్థిరపడ్డారు.