సైంధవ్‌ నుంచి ఎమోషనల్ సాంగ్.. ‘ బుజ్జికొండవే ‘ అంటూ ఏడిపించేసిన వెంకీ మామ..

విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో కోట్లాదిమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను సొంతం చేసుకున్న వెంకటేష్‌ను ఎమోషనల్ సీన్స్‌లో కొట్టే వారే లేరు. ఇక ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెంకటేష్ సినిమా వస్తుందంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా వెంకి 75గా సైంధవ్‌ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకీ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య, రూహిణి శర్మ, ఆండ్రియ జెర్మియ ప్రధాన పాత్రలు పోషించారు.

Saindhav (2024) - IMDb

ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్, సాంగ్స్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి బుజ్జికొండవే అంటూ ఎమోషనల్ సాంగ్ విడుదలైంది. కూతురు అనారోగ్యంతో బాధపడుతున్న టైం లో ఆమెను హ్యాపీగా ఉంచాలని ఓ తండ్రి ఎంతలా ఆరాటపడతాడు అనేది ఈ సాంగ్‌లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక రామజోగయ్య శాస్త్రి తన అద్భుతమైన లిరిక్స్‌తో సన్నివేశాన్ని.. మనసును హత్తుకునేలా డిజైన్ చేశాడు.

Saindhav (2024) - IMDb

ఎస్పీ చరణ్ తన మ్యూజికల్ వాయిస్ తో భావోద్వేగాలకు ప్రాణం పోసాడు. ముఖ్యంగా వెంకటేష్ ను కూతురు నవ్వమని అడిగినప్పుడు ఓ పక్క కంటి నుంచి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ నవ్వుతున్నట్లు వెంకటేష్ చేసిన నటనను చూస్తే ఎవరికైనా కంటతడి ఆగదు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న తన చిన్నారిని కాపాడుకోవడానికి వెంకటేష్ ఏం చేశాడు.. ఏలా ఆమెను ద‌క్కించుకున్నాడు.. అనే కథాంశంతో సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాతో.. వెంకీ మామ ఎలాంటి రిజల్ట్ తన ఖాతాలో వేసుకుంటాడో వేచి చూడాలి.