” డెవిల్ ” సక్సెస్ మీట్ లో పార్ట్ 2 స్టోరీని రివిల్ చేసిన కళ్యాణ్ రామ్… ఏంటి బాసు ఇది…!

నందమూరి హీరోలలో ఒకడైన కళ్యాణ్ రామ్ మనందరికీ సుపరిచితమే. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ ” డెవిల్ “. అభిషేక్ నామ తెరకెక్కించిన ఈ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్ అనే టైటిల్ రోల్లో అదరగొట్టాడు.

యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ హిట్ కావడంతో.. సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు చిత్ర బృందం. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ డెవిల్ సీక్వెల్ ” డెవిల్ 2 ” గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..” డెవిల్ 2 కచ్చితంగా ఉంటుంది.

నా టీం మెంబెర్స్ తోనే ఉంటుంది. 2024 డెవిల్ 2 షూటింగ్ పనులు మొదలుపెట్టి.. 2025 లో రిలీజ్ చేస్తాం. అంతేకాకుండా.. ఈ సినిమా షూటింగ్ మొదలైన పది రోజులకే.. సీక్రెట్ సర్వీస్ తో కథను ముందుకు తీసుకెళ్లొచ్చు అని శ్రీకాంత్ చెప్పాడు. ఇక డెవిల్ 2 లో 1940 ఎరా కనిపిస్తుంది. 2000 ఎరా కూడా కనిపిస్తుంది. ఈ రెండు కలాలు కలిపి చూడబోతున్నారు ” అంటూ పార్ట్ 2 స్టోరీని లీక్ చేశాడు కళ్యాణ్ రామ్. ఇక ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.