ఎంత బ్యాడ్ లక్ .. ఇంటికి వెళ్లి ఆఫర్ ఇస్తే “డెవిల్” మూవీ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!!

కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన సినిమా డెవిల్ . బింబిసారా తర్వాత అలాంటి హిట్ అందుకోవడానికి ట్రై చేసి అమిగోస్ సినిమాలో నటించారు . అయితే ఆ సినిమా డిజాస్టర్ గా మారింది . ఆ తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమాను తెరకెక్కించారు . అయితే డెవిల్ మాత్రం అమిగోస్ అంత ఫ్లాప్ అవ్వలేదు.. అలా అని బింబిసారా అంత హిట్ అవ్వలేదు. యావరేజ్ గా నిలిచింది .

కధ.. కంటెంట్ అంతా కూడా కొత్తగా ఉండడం సినిమాకి ప్లస్ అయితే .. సినిమాకి క్లైమాక్స్ నెగిటివ్గా మారింది . ఫస్ట్ ఆఫ్ అంతా కూడా పాత్రను పరిచయం చేయడం బిజీగా అయిపోయిన దర్శకుడు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అద్దిరిపోయే రేంజ్ లో ఇచ్చాడు. ఆ తర్వాత ఎండింగ్లోకి వచ్చి క్లైమాక్స్ ని చెడ దొబ్బేశారు. దీంతో ఈ సినిమా యావరేజ్ గా మిగిలిపోయింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది . కానీ ముందుగా ఈ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ని అనుకున్నారట కళ్యాణ్ రామ్ . ఆమెను అప్రోచ్ కూడా అయ్యారట. ఇలాంటి పాత్ర నేను చేయలేను అంటూ రిజెక్ట్ చేసిందట . అలా మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది మృణాల్ ఠాకూర్. లక్కి ఛాన్స్ అందుకుంది సం యుక్తా మీనన్..!!