యూత్ కు ఫుల్ మీల్స్‌లా బబుల్‌గమ్.. ట్రైల‌ర్‌తోనే అద‌ర‌గొట్టాడుగా.. హిట్ ప‌క్కా..

టాలీవుడ్ ఇండస్ట్రియల్ యాంకర్ సుమకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా ఈమె తనయుడు రోషన్ కనకాల సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. బబుల్ గ‌మ్‌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అల్లరించబోతున్నాడు. రోషన్‌కు జంటగా మానస చౌదరి ఈ సినిమాలో నటిస్తోంది. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ తో యూత్ పై మంచి ఇంపాక్ట్ చూపించాడు రోషన్. ముఖ్యంగా ఈ ట్రైలర్లో యూత్ నే టార్గెట్ చేస్తూ కట్స్ రిలీజ్ చేశారు. తన లవర్ వల్లే ఓ వ్యక్తికి అవమానం ఎదురైతే ఆ కుర్రాడు భావోద్వేగాలు ఎలా ఉంటాయి అనేది క్లియర్ కట్‌గా చూపించాడు రోషన్. అలాంటి సందర్భాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ఆ వ్యక్తి ఎలా సక్సెస్ అయ్యాడు..? అదేవిధంగా ఆమెపై రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు..? అనే అంశంతో ట్రైలర్ రిలీజ్ అయింది.

ఇందులో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ట్రైలర్ తోనే కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టిన రోషన్.. ఈ సినిమాతో పక్క సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు. ఈ ట్రైలర్లో కట్స్ చూస్తే మరో బేబీలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్ట‌డం ఖాయం అనే విధంగా ఉంది. డిసెంబర్ 29న బబుల్‌గమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.