బిగ్ బాస్ విన్నర్ గా రైతుబిడ్డ.. ఆ ఒక్క మాటతో ఫ్యాన్స్ ని ఫ్లాట్ చేసేసాడుగా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విజేత‌గా రైతు బిడ్డ పల్ల‌వి ప్రశాంత్ నిలిచాడు. ఆఖరి వరకు ఎంతో ఉత్కంఠ గా జరిగిన ఈ ఫినాలే ఎపిసోడ్లో చివ‌రిగా అమర్దీప్ , పల్లవి ప్రశాంత్‌ ఇద్దరు మాత్రమే మిగిలారు. దీంతో హౌస్ మేట్స్ అలాగే ఆడియన్స్ అందరిలోనూ ఎవరు విన్ అవుతారా అనే ఉత్కంఠ మొదలైంది. ఫైనల్ గా కౌంట్‌డౌన్ ఎండ్ అయ్యేసరికి నాగార్జున, పల్లవి ప్రశాంత్ చేతిని గాల్లోకి లేపి యు ఆర్ ద విన్నర్ అంటూ ప్రకటించాడు. దీంతో స్టేజిపై పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయిపోయాడు. తన స్పీచ్ తో అందరి మనసును మరోసారి ఆకట్టుకున్నాడు. గ్రాండ్ ఫినాలే ఆఖరి దశలో ఏం జరిగిందంటే.. హోస్ట్ నాగార్జున స్వయంగా హౌస్ లోకి వెళ్లి ఫైనల్గా మిగిలిన ఆమర్ దీప్‌, పల్లవి ప్రశాంత్ ల‌ను బయటికి తీసుకువచ్చాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఆఖరి మజిలీకి వీరు ముగ్గురు సిద్ధమయ్యారు. ఇక కౌంట్ డౌన్‌ స్టార్ట్ అయ్యే సరికి అందరిలో టెన్షన్. ముఖ్యంగా అమర్ భార్య తేజస్విని చాలా టెన్షన్ ఫీల్ అయింది. నిజానికి లాస్ట్ మినిట్ లో విన్నర్ అనౌన్స్ చేసేందుకు మహేష్ బాబు వస్తాడని అంతా ఫీలయ్యారు. అయితే మహేష్ బాబు రాలేదు నాగార్జున దీన్ని స్వయంగా అనౌన్స్ చేశాడు. ముందుగా వారిద్దరి ఏవిని చూసిన తర్వాత విన్నర్ అనౌన్స్మెంట్ జరిగింది. అమర్‌దీప్ చేతిని వదిలేసి.. నాగార్జున సింపుల్ గా పల్లవి ప్రశాంత్ విన్నర్ అని చెప్పగానే ప్రశాంత్.. నాగార్జున కాళ‌ మీద పడిపోయి ఏడుస్తూ ఎమోషనల్ అయ్యాడు. నాకు ఓటు వేసిన ఆడియన్స్ అందరికీ ఎంతో రుణపడి ఉంటానని.. అక్కలు, చెల్లెళ్లు అందరికీ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ అంటూ చెప్పుకొచ్చాడు.

తెలుగు రెండు రాష్ట్రాల ముద్దుబిడ్డ ఈ రైతు బిడ్డని గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు అంటూ వివరించాడు. బి బి ట్రోఫీని పట్టుకొని నా మాట నిలబెట్టుకుంటా అంటూ నాగార్జునకి వివరించాడు. అమర్ కి.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి ఇద్దరికీ మధ్యలో కొద్దిగా మాత్రమే తేడా ఉందని నాగార్జున వివరించాడు. అమర్ మాట్లాడుతూ నాకు సపోర్ట్ చేసిన అందరికీ పాదాభివందనాలు.. నేను పుట్టిన ఊరు అనంతపురం ప్రజలందరికీ ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చాడు. అమర్దీప్ ని స్టేజిపై నుంచి పంపేసిన తర్వాత పల్లవి ప్రశాంత్ కి స్టార్ మా బిజినెస్ హెడ్ రాఘవగారు వచ్చి 35 లక్షల చెక్ అందించాడు. ఈ చెక్ తీసుకున్న ప్రశాంత్ పేద రైతులకు డబ్బు ఇస్తానంటూ అనౌన్స్ చేశాడు.

దీంతో చప్పట్లతో స్టేజి మారుమోగిపోయింది. అయితే ముందుగా అనుకున్నట్లే విన్నర్ కి బ్రీజా కార్, జోస్ అలుకాస్ రూ.15,00,000ల‌ డైమండ్ నెక్లెస్ కూడా వచ్చేసింది. ఇవన్నీ తీసుకొని పల్లవి ప్రశాంత్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ప్రతిరోజు బిగ్ బాస్ కి వెళ్ళాలని కలగని.. నాగార్జున గారి ప్రోత్సాహంతో నేను బిగ్ బాస్ కి వచ్చా. నాగార్జున గారి నవ్వు వల్లే ఆకలి బాధలు తీరాయి. అలాగే రూ.35 లక్షల ఈ డబ్బుని రైతులకే ఇచ్చేస్తా అంటూ జై జవాన్ జై కిసాన్ మళ్లీ వచ్చాను అంటే తగ్గేదేలే డైలాగ్ తో స్పీచ్ ని ముగించాడు. అదేవిధంగా కార్ మా నాన్నకి, డైమండ్ నెక్లెస్ మా మమ్మీకి ఇస్తానంటూ వివరించిన పల్లవి ప్రశాంత్.. ఫైనల్ గా ఈ సీజన్ విన్నర్ గా నిలిచి కామన్ మ్యాన్ పవర్‌ని చూపించాడు.