హీరో వెంక‌టేష్ ఆస్తులు చూస్తే క‌ళ్లు జిగేల్‌.. అన్ని కోట్లు ఎలా వ‌చ్చాయ్‌…!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా సొంత టాలెంట్ తో స్టార్ హీరో క్రేజ్ ని దక్కించుకున్నాడు వెంకీ. ఇక ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమా రంగంలో కనబడడం లేదు వెంకటేష్. ఈ క్రమంలోనే ఈయన సీక్రెట్ విషయాలను బయటకు లాగుతున్నారు ప్రేక్షకులు.

ఈ నేపథ్యంలోనే ఈయన ఆస్తుల విలువ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంకటేష్, నీరజారెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి ముగ్గురు ఆడపిల్లలు.. ఒక అబ్బాయి జన్మించారు. తన పెద్ద కూతురికి మొన్నీ మధ్యనే ఘనంగా వివాహం కూడా జరిపాడు వెంకటేష్.

ఇక మరొకవైపు తన తండ్రి రామానాయుడు ఏర్పాటు చేసిన సురేష్ ప్రొడక్షన్స్ స్టూడియోలో తన అన్నతో పాటు వెంకటేష్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక వెంకటేష్ ఆస్తుల విలువ విషయానికి వస్తే.. రూ.2 వేల కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈయనకి తన తండ్రి నుంచి వారసత్వముగా కూడా ఆస్తులు లభించినట్లు తెలుస్తుంది. ఇక మొత్తంగా వెంకటేష్ ఆస్తుల విలువ రూ.3 వేల కోట్లకు పైగా ఉందట.