స‌ల్మాన్ ఖాన్ ” టైగ‌ర్ 3 ” షార్ట్ రివ్యూ..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా.. సల్మాన్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన తాజా మూవీ టైగర్ 3. యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యూనివర్సల్ లైన్లో భాగంగా రిలీజ్ అయిన ఐదో సినిమా ఇది. ఇక దీపావళి కానుకగా ఈరోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన‌ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవ‌ల రిలీజై మూవీ పై ప్రేక్షకుల్లో భారీ బ‌జ్‌ను క్రియేట్ చేసింది. బాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా టైగర్ 3 సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఫస్ట్ షో పూర్తయిపోయింది.

Tiger 3 review and release live updates: Fans share videos of those cameos  from first day first show of Salman Khan film | Hindustan Times

సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూ ని కూడా షేర్ చేసుకున్నారు. ఏక్తా టైగర్, టైగ‌ర్ జిందా హై సినిమాలకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. కొంతమంది సినిమా అదిరిపోయింది అంటూ చెబుతుంటే.. మరి కొంతమంది ఊహించిన రేంజ్ లో అయితే సినిమా లేదు.. అంతగా బాగోలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది షారుక్ ఖాన్ నటించిన భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్లు అందుకున్న పఠాన్, జవాన్ సినిమాలతో కంపేర్ చేస్తూ ఆ రేంజ్ లో అయితే టైగర్ 3 లేదు అంటూ ట్యాగ్ చేస్తున్నారు.

యాక్ష‌న్ సీన్స్ బాగున్నా కథ మాత్రం రొటీన‌గా ఉంది అనిపించింది అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మణిష్ శర్మ జేమ్స్ బాండ్ సినిమా మాదిరిగానే ఎమోషన్, యాక్షన్ మూవీ గా కూడా ఈ సినిమాను రూపొందించాడని వివరించారు. పై థ్రిల్లర్లకు బాబుల ఈ సినిమా ఉందంటూ చెప్పుకొస్తున్నారు. సల్మాన్ ఖాన్ కు ఇది మంచి కం బ్యాక్ మూవీ అని, ఇమ్రాన్ విల్లనిజం అదిరిపోయింది అంటూ కత్రినా కైఫ్ యాక్షన్ సీక్వెన్స్ తో తన సత్తా చాటుకుంది అంటూ చెప్పుకొస్తున్నారు.

Tiger 3 advance booking crosses ₹10 cr, film to run 24x7 from Monday |  Bollywood - Hindustan Times

అయితే మరికొందరు మాత్రం టైగర్ అంచనాలను అందుకోలేదని.. సల్మాన్ ఖాన్ చాలా డల్ గా అనిపించాడని.. తన సత్తా సినిమాలో కనిపించలేదని.. ఆయన స్క్రీన్ ప్రజెంట్ లో ఫ‌వర్ తగ్గిపోయిందంటూ షారుక్ తన మూవీస్‌ని ఒక రేంజ్‌కు తీసుకువెళ్లాడు కానీ సల్మాన్ మాత్రం ఆ రేంజ్‌లో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయాడని, కత్రినా తన క్యారెక్టర్ పరిధి వరకు చాలా బాగా నటించింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా హిట్టా, ఫ్లాటా తెలియాలంటే పూర్తి రివ్యూ వచ్చేవరకు వేచి చూడాలి.