విజయ రిజెక్ట్ చేసిన 10 సినిమాలు.. వాటిలో సగం పైగా బ్లాక్ బస్టర్ లే..

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ సమయంలోనే రౌడీ హీరోగా క్రేజ్‌ సంపాదించుకొని కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న విజయ్ తన‌ సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. కొన్ని సినిమాలు స్టోరీ లైన్ నచ్చక.. కొన్ని స్టోరీస్ డేట్స్ కుదరక.. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ లేదనిపించి.. ఇలా పలు సినిమాలను రిజెక్ట్ చేశాడు. అయితే అలా విజయ్‌ వదులుకున్న సినిమాలు ఏంటి.. వాటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయో.. చూద్దాం.

Cheap >dear Comrade Naa Songs Big Sale OFF 61%, 59% OFF

డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ :
డియర్ కామ్రేడ్ మూవీలో విజయ్ దేవరకొండనే నటించాడు కదా రిజెక్ట్ చేశాడు అంటారేంటి అనుకుంటున్నారా.. డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ నటించిన సంగతి నిజమే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మాత్రమే డియర్ కామ్రేడ్‌ సినిమాలో విజయ్‌ నటించాడు. అయితే తరువాత ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని కరణ్ జోహార్ భావించారు. కానీ డియర్ కామ్రేడ్ తెలుగులో తప్ప మిగతా భాషల్లోనూ డిజాస్టర్ కావడంతో హిందీలో రీమేక్ చేయడానికి నో చెప్పాడు విజయ్ దేవరకొండ.

Nithiin And Rashmika Mandanna's Bheeshma Movie HD Posters

భీష్మ :
నితిన్ హీరోగా – వెంకీ కుడుముల డైరెక్షన్లో రూపొందిన మూవీ భీష్మ. 2020 లో రిలీజ్ అయిన ఈ సినిమా కు మొదటగా విజయ్ దేవరకొండను హీరో అనుకున్నారట. అయితే విజయ్ దేవరకొండ కథ నచ్చకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. తర్వాత ఈ సినిమాను నితిన్ చేసి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్‌ వద్ద జెండా ఎగరేసింది.

Kabir Singh in the age of Netflix and Amazon Prime? Alexa, play Arjun Reddy  - India Today

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ :
తన సినిమాల్లో రీమేక్ చేసుకోవడానికి విజయ్ ఎప్పుడు ఇష్ట‌ప‌డ‌డు. డియర్ కామ్రేడ్ విషయంలో లాగానే అర్జున్ రెడ్డి సినిమాను కూడా హిందీ రీమేక్ చేయడానికి విజయ్ నో చెప్పాడట. సందీప్ వంగా మొదటగా హిందీలో రీమేక్ కూడా విజయనే అడగగా.. అప్పటికే తెలుగులో చేసిన సినిమాను మళ్ళీ హిందీలో రీమేక్ తన హీరోగా నటించటం ఇష్టంలేక దాన్ని రిజెక్ట్ చేశాడట విజయ దేవరకొండ.

2 years of 'iSmart Shankar': 5 reasons why the Ram Pothineni, Nabha Natesh  and Nidhhi Agerwal starrer became a huge hit | The Times of India

ఇస్మార్ట్ శంకర్ :
రామ్ పోతినేని హీరోగా – పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాను మొదటగా విజయ్ దేవరకొండ ను తీసుకోవాలని భావించారట పూరి. కానీ కథ నచ్చకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసాడట రౌడీ హీరో. తర్వాత రామ్ ఈ సినిమాలో నటించి భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Karan Johar inks 100 crore deal with Vijay Devarakonda?

కరణ్ జోహార్ సినిమా హిందీ:
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ కు ఒకసారి కాదు రెండు సార్లు షాక్ ఇచ్చాడు. రౌడీ హీరో అర్జున్ రెడ్డి సినిమాతో పాపులారిటీ దక్కించుకున్న టైంలో బాలీవుడ్‌కు పరిచయం చేయాలని కరణ్‌ తెగ ట్రై చేశాడట. తానే నిర్మాతగా మరి ఓ భారీ సినిమాను చేయాలని భావించాడట. కానీ చివరి నిమిషంలో విజయ్ ఆ సినిమాకు నో చెప్పాడు. డియర్ కామ్రేడ్ రీమేక్‌కి నో చెప్పిన విధంగానే ఈ సినిమాను కూడా హ్యాండ్ ఇచ్చినా.. విజయ్ – కరణ్ జోహార్ తో మాత్రం మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు.

Vijay Deverakonda rejects Koratala Siva?

కొరటాల శివ మూవీ :
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఒకరైన కొరటాల శివ మూవీ అవకాశం దొరికితే బాగుండు అని చాలామంది హీరోలు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండకు.. కొరటాల శివ ఓ మంచి స్టోరీ చెప్పగా ఆ స్టోరీ నచ్చలేదని కథను రిజెక్ట్ చేశాడట. కానీ దాన్ని కొరటాల శివ కూడా పాజిటివ్ గానే తీసుకున్నారని న్యూస్ వినిపిస్తుంది. వీరిద్దరూ ఎప్పటికైనా కలిసి ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట.