చలికాలంలో బరువు పెరగకుండా చేసే మార్గాలు ఇవే..!!

సాధారణంగా చలికాలంలో ప్రతి ఒక్కరూ బరువు పెరుగుతూ ఉంటారు. అలా బరువు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చలికాలంలో జిమ్, వాకింగ్ వంటి అలవాట్లు చేసుకోవాలి. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎక్కువ క్యాలరీలు, కొవ్వు ఉన్న ఫుడ్ తినడం మానుకోండి. చలికాలంలో అతిగా తినడం మంచిది కాదు.

శారీరక శ్రమ ముఖ్యం. ఈ రోజుల్లో మీ ఆహారాలలో చలికాలంలో ఎక్కువగా దొరికే పండ్లు, కూరగాయలను చేర్చుకోండి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం లాంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. చలికాలంలో చాలామంది దాహం వెయ్యలేదని వాటర్ తాగడం మానేస్తారు. ఇది మంచిది కాదు.

చలికాలంలో దాహం వేసిన వేయకపోయినా కనీసం 8 గ్లాసుల వాటర్ తాగాలి. చలికాలంలో హాలిడేస్ ఎంజాయ్ చేయండి. కానీ తినే దానిపట్ల శ్రద్ధ వహించండి. మీ బరువును అదుపులో ఉంచుకోవడం ఒక్క యోగాతోనే సాధ్యం. అలాగే చలికాలంలో ఎక్కువసేపు కూర్చుని ఉండడం అసలు మంచిది కాదు. ఎప్పుడు తిరుగుతూ ఉండడం మంచిది. ఈ జాగ్రత్తలు క‌నుక చలికాలంలో పాటిస్తే మీ బరువు అస్సలు పెరగదు.