ఇబ్బందుల్లో పడ్డ కమల్ హాసన్…ఈ సమస్య నుంచి ఎలా బయటకు వస్తారో?

బిగ్ బాస్ ఒక జాతీయ స్థాయి టీవీ షో. హిందీ మొదలైన ఈ షో, ఇప్పుడు హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా ప్రసారమవుతుంది. తమిళ్ బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని, ఎడొవ సీజన్ ను ప్రారంభించింది. ఈ షో కు తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. అక్టోబర్ 1 న 23 హౌస్ మేట్స్ తో మొదలైన ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది ఎలిమినేట్ ఐపోయారు. తాజా రేటింగ్స్ ప్రకారం ప్రముఖ నటి అర్చన మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో సీనియర్ నటి విచిత్ర కొనసాగుతోంది. ఇంతకీ తమిళ బిగ్ బాస్ గురించి మనకెందుకు అంటారా ? ఐతే ఇది వినండి.

తాజాగా బిగ్ బాస్ లో టాస్క్ లో భాగంగా నటి విచిత్ర చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో దుమారం రేపుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే…విచిత్ర తమిళ నటి ఐనప్పటికీ, ఆమె అనేక తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. కానీ ఆమెకు తెలుగులో ఒక హీరో వలన చాలా ఇబ్బందులు వచ్చాయని, ఎన్నో కాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కొన్నానని, సినిమాలు మానేయడానికి అది కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చింది విచిత్ర. ఈ విషయాల గురించి, శని, ఆదివారాలలో ప్రసారమవ్వబోతున్న ఎపిసోడ్ లో కమల్ ఆమెను ఆ హీరో గురించి ప్రశ్నిస్తారా? లేదా? అన్న సందేహం ప్రేక్షకులను కలవరపెడుతుంది.



ఈ విషయమై ఒక ప్రముఖ తమిళ జర్నలిస్ట్ మాట్లాడుతూ, “కమల్ ఒక నిజమైన, నిజాయితీ గల రాజకీయ నాయకుడు, నిజాయతి గల మనిషి ఐతే రాబోయే బిగ్ బాస్ ఎపిసోడ్ లో విచిత్రను, ఆ హీరో గురించి, ఆమె సమస్యల గురించి ప్రశ్నించాలి. అటువంటి మనిషిని సమాజానికి దూరంగా ఉంచాలి. సినీ పరిశ్రమలో ఇటువంటి సమస్య మరే అమ్మాయికి రాకూడదంటే, అతనెవరో బయటపెట్టి తీరాలి” అని అన్నారు. ఈ విషయంలో కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారనే చెప్పాలి. కమల్ ప్రస్తుతం తన రాజకీయ జీవితానికి పునాదులు వేసే పనిలో ఉన్నారు.

ఇలాంటి సమయంలో ఇటువంటి సమస్య ఆయన వరకు చేరిన తరువాత, ఆయన రియాక్ట్ అవ్వకపోతే అది ఆయన రాజకీయ జీవితాన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. కానీ అదే సమయంలో ఆయన ఆ హీరో ఎవరో బయటపెట్టే ప్రయత్నం చేస్తే, అతను పెద్ద హీరో అని విచిత్ర చెప్తోంది కనుక, తెలుగు రాష్ట్రాలలో కమల్ కు ఉన్న సినిమా మార్కెట్ దెబ్బతినే అవకాశం ఉంది. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కమల్ తానూ ఎంతగానో ప్రేమించే సినిమాకు ఓటు వేస్తారో, లేక తానూ ఎంతగానో ఆశిస్తున్నా రాజకీయానికి ఓటు వేస్తారో వేచి చూడాలి.