పట్టు చీరలో వయ్యారాలు వలకబోసిన మెగా డాటర్.. బుట్ట బొమ్మలా..

మెగా డాటర్ నిహారిక ఈ పేరుకు సోషల్ మీడియాలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా హీరో నాగబాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక మొదట బుల్లితెరపై ఓ షోకు యాంకర్ గా వ్యవహరించింది. ఆ షోతో మంచి పాపులారి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత హీరోయిన్గా అవకాశాలను అందుకుంది. అయితే ఈమె నటించిన సినిమాలవి ఊహించిన రెంజ్‌లో సక్సెస్ అందుకోకపోవడం ఒకసారిగా అవ‌కాశాలు తగ్గాయి. తర్వాత జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ సినిమాల‌కు దూరం అయ్యింది.

 

ఇక ఇటీవల మనస్పర్ధలు కారణంగా చైత‌న్య‌తో విడాకులు తీసుకుంది. వీరిద్దరు విడాకుల తర్వాత నిహారిక తన సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. సినిమా అవకాశాల కోసం హాట్ ఫోటోషూట్లు చేస్తూ.. ట్రెండీ వేర్‌లో దర్శనమిస్తూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఇటీవల ఓ సినిమాకు ప్రొడ్యూసర్‌గా మారిన నిహారిక.. గతంలో కూడా పలు వెబ్ సిరీస్‌లకు, షార్ట్ ఫిలిమ్స్ కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి లాభాలను అందుకుంది.

ప్రస్తుతం ఇమే ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న సినిమాల్లో చాలామంది కొత్త నటుల‌ను పరిచయం చేయబోతుంది. ఇక ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లతో కుర్రాళ్లకు హాట్‌ ట్రీట్ ఇచ్చే ఈ బ్యూటీ ఇటీవల చీరకట్టులో అచ్చ తెలుగు ఆడపిల్లల మెరిసింది. క్రీమ్ కలర్ శారీలో కుందనపు బొమ్మల కనిపించింది. కుర్రాళ‌ను ఆకట్టుకునే విధంగా ఆమె చిరునవ్వు నవ్వుతూ వయ్యారాలు వలకబోస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అచ్చం బుట్ట బొమ్మలా ఉన్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్లు.

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)