RX -100 హీరో పెళ్లి వెనుక ఇంత కథ ఉందా..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో కార్తికేయ మొదట Rx -100 చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా పాయల్ రాజ్ పుత్ నటించి భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగానే ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆర్ఎక్స్ 100 సినిమా ఒక్కసారిగా మంచి పాపులారిటీ అందించింది.

ఆ తర్వాత గుణ 369, ఇటీవలే వచ్చిన బెదురులంక-2012 సినిమాలు తప్ప పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తమిళ హీరో అజిత్ నటించిన వాలిమై సినిమాలో విలన్ గా నటించి అదరగొట్టేశారు. తాజాగా కార్తికేయ వివాహమై ఏడాది కావస్తున్న తరుణంలో తన వివాహ రోజున చాలా గ్రాండ్గా జరుపుకున్నారు.ఆయన మ్యారేజ్ డే సందర్భంగా ప్రేమ పెళ్లి గురించి తెలియజేయడం జరిగింది.. కార్తికేయ వరంగల్ నిట్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారట.

వాళ్ల కాలేజీలోనే చదువుతున్న లోహిత రెడ్డి అనే అమ్మాయితో 2010లో ప్రేమలో పడ్డారట. అలా 2021 వరకు ఈ ప్రేమని కొనసాగిస్తూ వచ్చారట.దాదాపుగా పదేళ్లపాటు వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనని తాను నిరూపించుకున్న తరువాత 2021 నవంబర్ 25న చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసి అభిమానులు సైతం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఉన్న కాలంలో ఏడాది రెండేళ్లలోపు ప్రేమించి విడిపోతూ ఉంటే వీరు పది ఏళ్ల పాటు ఎలా ప్రేమించుకున్నారు అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.