మెడ పై టాటూ సీక్రెట్లు బాలయ్య ముందు రివీల్ చేసిన రణ్‌బీర్ కపూర్..?

బాలీవుడ్ స్టార్‌హీరో రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. డిసెంబరు 1న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు కేవలం లవర్ బాయ్గా, రొమాంటిక్ హీరోగా కనిపించిన రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాతో తనలో ఉన్న మాస్ కోణాన్ని బయట పెట్టబోతున్నాడు. వైల్డ్ క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రణబీర్ ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొల్పాయి. అప్పుడప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల మంచి హైప్‌ తెచ్చుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా జరుగుతున్నాయి.

అర్జున్ రెడ్డి ఫేమ్‌ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా లో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తుంది. ఇక ఇప్పటికే భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా నుంచి 2 సింగిల్స్ రిలీజ్ అయ్యాయి. ఫుల్ రొమాంటిక్ నేపథ్యంలో ఓ సాంగ్, ఫాదర్ సెంటిమెంట్‌తో వచ్చిన మరో సాంగ్ రెండు సూపర్ హిట్గా నిలిచాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సందీప్ రెడ్డి.వంగా, రష్మిక, రణ్‌బీర్ కపూర్ కలిసి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ ఎపిసోడ్ ఎంతో ఫన్నీగా సాగడంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్లోని ఓ సీన్లో టాటూల గురించి చర్చలు రాగా రణ్‌బీర్ కపూర్ తన మెడపై ఉన్న టాటూ చూపించి దాని సీక్రెట్ రివీల్‌ చేసాడు. బాలయ్యతో రణ్‌బీర్ మాట్లాడుతూ అటాటూని చూపించాడు. అయితే ముందుగా ఆ టాటూ ఆలియాది అయి ఉంటుందని అందరూ భావించారు. కానీ రణ్‌బీర్ అటాటును రివీల్ చేస్తూ తన కూతురు రాహ పేరంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాహా పై తనకు ఉన్న ప్రేమను వివరించిన రణ్‌బీర్ ప్రేక్షకులకు ఈషోద్వారా మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.