” రష్మికకు అసలు యాక్టింగ్ రాదు… అయినా ఆఫర్స్ వస్తున్నాయి “…. నటుడు సెన్సేషనల్ కామెంట్స్…!!

నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ… ఓ మార్పింగ్ వీడియో కి గురైన సంగతి తెలిసిందే. ఇక ఈ బ్యూటీ తాజాగా నటిస్తున్న మూవీ ” యానిమల్ “. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది రష్మిక. ఇక ఈ సినిమాలో రణ్‌ బీర్ కపూర్, రష్మిక కెమిస్ట్రీ అదిరిపోయిందని కామెంట్లు రాగా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కె.ఆర్.కే మాత్రం అసలు ఈ హీరోయిన్‌కి యాక్టింగే రాదని ట్వీట్ చేశాడు.

ఇదే ప్రూఫ్ అంటూ ” యానిమల్ ” ట్రైలర్ లోని ఓ సీన్ ను షేర్ చేశాడు. అయితే బాలీవుడ్‌లో యాక్టింగ్ బేస్ చేసుకుని సినిమా ఆఫర్స్ రావాలంటే.. కత్రిన, జాక్వెలిన్, నర్గీస్ లాంటి నటీమణులకు అవకాశాలే రావు కదా అని పోస్ట్ పెట్టాడు. ఇక దీనిపై స్పందిస్తున్న కొందరు ప్రేక్షకులు..” యానిమల్ సినిమాకు మైనస్ పాయింట్ రష్మిక అనే అంటున్నారు.

అయినా థర్డ్ క్లాస్ యాక్టర్ కూడా నేషనల్ క్రష్ యాక్టింగ్ గురించి మాట్లాడటం ఏంటో ” అంటూ కొందరు కె.ఆర్.కే ను విమర్శిస్తున్నారు.”నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే నీకు అవకాశాలు రావాలి కదా. ఎందుకంటే నువ్వు యాక్టింగ్ లో జీరో కదా ” అంటూ అతడి పై మండిపడుతున్నారు. ప్రస్తుతం కె ఆర్ కే పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.