సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడైన స్టార్ హీరో ఎవరు తెలుసా..?

సౌత్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద ఇటీవల బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సైతం అందుకుంటున్నారు. జైలర్ సినిమాతో రజనీకాంత్ సూపర్ హిట్ క్రియేట్ చేయగా విక్రమ్ సినిమాతో కమలహాసన్ ఇక ఇటీవలే లియో సినిమాతో విజయ్ దళపతి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. బాలయ్య భగవంత్ కేసరి సినిమా పరవాలేదు అనిపించుకుంది. అయితే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోల రెమ్యూనరేషన్ భారీగానే పెన్ చేశారని తెలుస్తోంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 430 కోట్ల నికర ఆస్తి కలిగి ఉన్న ఏకైక హీరో రజనీకాంత్ జైలర్ సినిమా కోసం 110 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నారు. లియో సినిమా కోసం విజయ్ దళపతి 130 కోట్లు.. ఇండియన్-2 సినిమా కోసం కమలహాసన్ 150 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో అత్యధికంగా రెమ్యూనరేషన్ కలిగి ఉన్న హీరో ఎవరు అనే విషయంపై GQ ఒక రిపోర్టుని తెలియజేయడం జరిగింది.

దాదాపుగా 3 వేల కోట్ల రూపాయలు ఆస్తి కలిగే ఉన్న ఏకైక హీరో అక్కినేని నాగార్జుననేనట.. నిర్మాతగా పోస్టుగా హీరోగా పారిశ్రామికవేతగా భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అన్నపూర్ణ స్టూడియో లో పలు సినిమాలను నిర్మించడం ద్వారా భారీ ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ తో పాటు పలు రకాల సంపదలతో కూడా ముందుకు వెళుతున్నారు నాగార్జున. అలాగే పలు రకాల బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ ఆస్తి విలువ 2200 కోట్లు కాక చిరంజీవి ఆస్తి 1650 కోట్లు. ఇక రామ్ చరణ్ ఆస్తి 1370 కోట్లు ఉన్నట్లు సమాచారం.