ఆ రికార్డుని సొంతం చేసుకున్న సూర్య… మరెవ్వరు దాన్ని టచ్ చేయలేరుగా…!!!

సూర్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు సూర్య. తమిళ్ సినిమాలను తెలుగులో విడుదల చేసి భారీ విజయాలను సైతం అందుకున్నాడు. ప్రస్తుతం సూర్య కెరీర్‌లోనే మోస్ట్ అవెయిటేడ్ సినిమాగా రూపొందుతుంది ” కంగువా “. శివ దర్శకత్వంలో దిశా పఠాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది.

ఇక ఈ సినిమాపై సూర్య అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్‌లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఏకంగా ఆరు డిఫరెంట్ యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నాయట. అంతేకాదు గతంలో పది భాషలలో మాత్రమే ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ ఇప్పుడు ఏకంగా మరికొన్ని భాషలలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. నిర్మాత జ్ఞానవేల్ మాట్లాడుతూ..” ప్రపంచవ్యాప్తంగా 38 భాషలలో 3d ఐమాక్స్ ఫార్మాట్లోనే కంగువ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము ” అంటూ తెలిపారు. కాగా 38 భాషలలో విడుదల అవుతున్న మొదటి సినిమాగా ” కంగువా ” తో సూర్య అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడనే చెప్పాలి. ఇక ఈ రికార్డుని మరెవరైనా టచ్ చేస్తారో లేదో చూడాలి.