ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్న రైతుబిడ్డ..‌ ఇక ఆమెకి మూడిందిగా…!!

బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మరో సూపర్ పవర్ పొందాడు. శివాజీ గ్యాంగ్‌లో ఒకడిగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సైతం సంపాదించుకున్నాడు. ప్రతి గేమ్ లోనూ తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. ఇక ఈ వారం కూడా ఓ కీలకమైన పోటీలో గెలిచాడు. రైతు బిడ్డ గెలవడంతో ఓ లేడీ కంటెస్టెంట్ కి శాపం అయ్యేలా ఉంది అంటూ టాక్‌. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఆ లేడీ కంటెస్టెంట్ ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం.

ఇక మంగళవారం నామినేషన్స్ పూర్తయిన అనంతరం ఎవిక్షన్ పాస్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ఏంటంటే.. గ్లాసులు, ప్లేట్లు బ్యాలెన్స్ చేసే టాస్క్. ఇందులో చివర వరకు వాటిని పడేయకుండా ఉండి ప్రశాంత్ ఈ గేమ్ లో గెలిచాడు. దీంతో ప్రశాంత్ కు ఎవిక్షన్ పాస్ సొంతమయ్యింది. ఇక ఈ పాస్ ని ప్రశాంత్ ఎప్పుడు, ఎవరికి ఉపయోగిస్తాడో తన ఇష్టం. ఒకవేళ ఈ వారం డబల్ ఎలిమినేషన్ కాబట్టి ఉపయోగించమని బిగ్ బాస్ చెప్పాడే అనుకుందాం.

ప్రశాంత్ కి ఓట్లు పడతాయి కాబట్టి తనకి తాను ఉపయోగించికోడు. ఎలిమినేషన్ లో ఉన్న మిగతా వాళ్ల కోసం అంటే యావర్, శివాజీ కి సైతం ఓట్లు పడతాయి కాబట్టి వాళ్ల కూడా సేఫ్. తనని నామినేట్ చేసిన గౌతమ్, గత వారం నామినేట్ చేసిన అర్జున్ కోసం దీన్ని ప్రశాంత్ అసలే ఉపయోగించకపోవచ్చు. ఇకా మొన్నటి వరకు ప్రశాంత్ తో మంచిగా ఉన్న రతిక.. ఈసారి అతడిని నామినేట్ చేసి తన ఇగో ని హార్ట్ చేసింది. దీంతో రతికకి బదులు అశ్వినికి ఈపాస్ ఉపయోగించి సేవ్ చేస్తాడేమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఈ పాస్ ఎవరికి ఉపయోగించి ప్రశాంత్ ఎవరిని సేఫ్ చేస్తాడు చూడాలి మరి.