భూమిక గ్లామర్ మేజిక్ కి ఇంటర్నెట్ షాక్ …..ఖుషి రోజులు గుర్తొస్తున్నాయి అంటూ కామెంట్స్!

ఎన్నో ఏళ్ళ పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో యువ రాణి గా వెలిగింది భూమిక. సింహాద్రి, ఒక్కడు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, వాసు, ఖుషి వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఒకానొక దశలో అనసూయ, కలెక్టర్ గారి భార్య వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో సైతం నటించింది భూమిక. కానీ కొన్నాళ్ళకు తన సినీ జీవితాన్ని పక్కన పెట్టి వివాహం చేసుకొని, భర్త పిల్లలలతో గడిపింది. కానీ సినిమా పట్ల ఆమెకు ఉన్న ప్రేమ, ఆమెను ఎంతో కాలం పరిశ్రమకు దూరంగా ఉంచలేకపోయింది. అందుకే తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది భూమిక. 22 ఏళ్ళ వయసులో యువకుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమిన భూమిక వయసు ఇప్పుడు 45 ఏళ్ళు. అయినా సరే ఆమె అందంలో, గ్రేస్ లో ఏమాత్రం మార్పు లేదు.

చాలా మంది సినీ తారల తరహాలోనే, భూమిక కూడా సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన క్యాషువల్ వర్కౌట్ డ్రెస్ లో కూర్చొని స్టైలిష్ ఫోజులతో తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, మళ్లీ ఖుషి చిత్రం లోని భూమిక గుర్తుకువస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ చిత్రం లోని చెలియా చెలియా చిరు కోపమా పాటను కామెంట్ గా పెడుతున్నారు మరి కొందరు. గత కొన్ని చిత్రాలలో కాస్త బొద్దుగా కనిపించిన భూమిక, ఈ ఫోటోలలో కాస్త సన్నగా కనిపించేసరికి ఆమెలోని మార్పును గమనించిన అభిమానులు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తన పని పట్ల, ఆరోగ్యం పట్ల ఆమెకు ఉన్న అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. భూమిక చివరిగా గోపి చంద్ హీరో గా నటించిన సీటీ మార్ మరియు దుల్కర్ సల్మాన్ సీతారామాం చిత్రాలలో నటించారు. ప్రస్తుతం తమిళంలో బ్రదర్ అనే చిత్రంలో నటిస్తుందని సమాచారం.