అల్లు అర్జున్ లో ఆ మార్పును గమనించారా.. దానికి కారణం వాళ్లేనట..?!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ చివరిగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కు కోట్లాదిమంది ప్రశంసలు అందాయి. ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఎదుగుతున్నాడు అంటే పాజిటివ్ తో పాటు ఆ హీరోకు నెగిటివిటీ కూడా బాగానే ఉంటుంది. ఇలా పుష్పా సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ పై విపరీతమైన ట్రోలింగ్ పెరిగిపోయింది. కొందరు ఇతర హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కన్నా ఎదుగుతుంటే భరించలేక.. వేరేదా కారణంగానో.. తెలియదు కానీ అల్లు అర్జున్ పై ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు.

అల్లు అర్జున్ తో పాటు మరో హీరో పై కూడా ఇదే విధంగా ట్రోల్స్ చేశారు. అతడే మహేష్ బాబు. మహేష్ బాబు ఇంతకుముందు స్టోరీ ఎంచుకునే విషయంలో ఫ్రీడమ్ గా ఉండేవాడు. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ట్రై చేస్తూ సినిమాల్లో నటించేవాడు. అయితే వరుసగా కొన్ని ఫ్లాప్‌లు రావడంతో మహేష్ ను దారుణంగా ట్రోల్స్ చేసి ఆయనను హర్ట్ చేశారు. దీంతో కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను మాత్రమే నటిస్తూ మినిమం గ్యారెంటీ సినిమాల్లోనే చేస్తున్నాడు మహేష్ బాబు. కొత్త కాన్సెప్ట్లకు పూర్తిగా దూరమయ్యాడు.

ఇక అల్లు అర్జున్ ఈ ట్రోలింగ్స్ తో బాగా ఎఫెక్ట్ అయ్యాడు. బ‌న్ని ఏ ఈవెంట్లో అయినా చాలా హార్ట్ ఫుల్ గా నవ్వుతూ ఉంటాడు. ఫెక్‌స్మైల్ రాదు. మనస్పూర్తిగా ఎలాంటి కల్మషం లేకుండా నవ్వే అల్లు అర్జున్ నవ్వును కూడా ఇతర హీరోల అభిమానులు కావాలనే ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. మీమ్స్‌లో అల్లు అర్జున్ నవ్వును ట్రోల్ చేస్తూ ఇన్సెల్ట్ చేశారు. ఇది బన్నీ దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం.

దీంతో బాగా హర్ట్ అయిన అల్లు అర్జున్ ఇటీవల మంగళవారం మూవీ ఈవెంట్లో పాల్గొనా మనస్పూర్తిగా నవ్వలేకపోయాడు. తన ముఖానికి చేయి అడ్డుపెట్టుకొని చిన్నగానవ్వాడు. దీన్ని బట్టి అల్లు అర్జున్ ఎంతగా హర్ట్ అయ్యాడో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో తమ అభిమాన హీరోలను మెచ్చుకోవడం ప్రశంసించడం సరైనదే. కానీ ఇతర హీరోలను కించపరిచే విధంగా మాట్లాడితే వారు కూడా సాధారణ మనుషులు నచ్చుకుంటారని అర్థం చేసుకుంటే బాగుంటుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్లు.