ఆ విషయంలో హీరోయిన్స్ అందరి కంటే సితారనే ఎక్కువ‌.. యానీ మాస్టర్ కామెంట్స్ వైరల్..

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. వరుస సినిమాల్లో నటిస్తున్న మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ డైరెక్ష‌న్‌లో గుంటూరు కారం సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. ఇకపోతే మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి మనకు తెలుసు. సితార ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను, ఫోటోషూట్లను, డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంటుంది.

ఈ నేపథ్యంలో సీతార డ్యాన్స్ నేర్పిన యానీ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు పిల్లల గురించి ఆసక్తికర విషయాలను వివరించింది. ఆమె మాట్లాడుతూ మొదట నేను గౌతమ్ కి డాన్స్ నేర్పించేదాన్ని అప్పుడు సితార చాలా చిన్న పిల్ల. గౌతమ్ కు డ్యాన్స్ నేర్పిస్తుంటే మధ్యలో వచ్చి అలా ఇలా రెండు స్టెప్పులు వేసి ముద్దు ముద్దుగా అక్కడ నుంచి పారిపోయేది. తర్వాత గౌతమ్ హయ్యర్ స్టడీస్‌కి వెళ్లడంతో సితారకు నేను డ్యాన్స్ మాస్టర్‌గా మారాను. సితార చాలా మంచి అమ్మాయి. అందరితో సరదాగా ఉంటుంది. నేను పెద్ద సూపర్ స్టార్ కూతురు అన్న గర్వం ఆమెలో కనిపించదు. నేను స్టార్టింగ్ లో అక్కడ జాయిన్ అయినప్పుడు తను చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు నా కన్నా హైట్ గా ఉంది.

బహుశా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికంటే కూడా సితారనే చాలా హైట్ గా ఉంటుంది అంటూ యానీ చెప్పుకొచ్చింది. సితార తన దగ్గర చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని, అందరితో తొందరగా కలిసిపోతుందని చెప్పుకొచ్చింది. ఇక డ్యాన్స్ క్లాస్ సమయంలో మహేష్ ను మీరు ఎప్పుడైనా కలిసారా అని అడగగా.. లేదు డ్యాన్స్ క్లాస్ ముగించుకుని ఎప్పుడైనా వెళుతూ ఉంటే ఆయన సడన్గా ఎదురయ్యేవారు. నేను అలానే నిలిచి ఉండిపోయే దానిని. ఆయన మాత్రం హలో మాస్టర్ అని పలకరించుకుంటూ వెళ్లిపోయోవారు అని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం సితార గురించి యానీ మాస్టర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.